ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మణిపూర్‌ పోలింగ్‌‌లో హింస, ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2022-03-05T21:36:39+05:30

మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌లో భాగంగా శనివారంనాడు హింస..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంఫాల్: మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌లో భాగంగా శనివారంనాడు హింస చెలరేగింది. తౌబల్‌ జిల్లాలో ఒక ఘటన, సెనాపతి జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 47.16 శాతం పోలింగ్ నమోదైనట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఛందేల్‌లో 48.95 శాతం, జిరిబామ్‌లో 49 శాతం, తౌబల్‌లో 47.48 శాతం పోలింగ్ నమోదైంది. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో జరగుతున్న పోలింగ్‌లో 92 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 8.38 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, ఫిబ్రవరి 28న జరిగిన తొలి విడత ఎన్నికల్లో దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేయడంతో చౌరచందర్‌పూర్, కాంగోప్కి, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం రీపోలింగ్ నిర్వహించినట్టు సీఈఓ తెలిపారు. మార్చి 10న ఓట్లు లెక్కింపు ఉంటుంది. 

Updated Date - 2022-03-05T21:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising