ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మణిపూర్‌లో సీఎం గెలుపు.. అధికారం దక్కుతుందా?

ABN, First Publish Date - 2022-03-10T21:29:14+05:30

మణిపూర్‌ అసెంబ్లీలో అధికార బీజేపీ ఈసారి కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలవబోతుంది. సీఎం ఎన్. బిరెన్ సింగ్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణిపూర్‌ అసెంబ్లీలో అధికార బీజేపీ ఈసారి కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలవబోతుంది. సీఎం ఎన్. బిరెన్ సింగ్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అయితే, తిరిగి ఆయన సీఎం అవుతారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మణిపూర్ అసెంబ్లీలో 60 స్థానాలున్నాయి. అధికారం దక్కాలంటే 31 సీట్లు కావాలి. గత ఎన్నికల్లో కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. 28 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటున్నప్పటికీ, పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మిత్రపక్షాల సాయంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. కానీ, ఎన్‌పీపీతో ఆయనకు విబేధాలు ఉండటంవల్ల ఆ పార్టీ మద్దతు ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బిరెన్ సింగ్ ప్రభుత్వంలో ఎన్‌పీపీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా చేసిన జోయ్‌కుమార్ సింగ్‌తోపాటు, బీజేపీకే చెందిన టీజీ విశ్వజిత్ సింగ్‌తోనూ విబేధాలున్నాయి. దీంతో బిరేన్ సింగ్ ముఖ్యమంత్రి కావాలంటే ఎన్‌పీపీతోపాటు, సొంత పార్టీ నేతల మద్దతు కూడా చాలా అవసరం. ఈ నేపథ్యంలో తర్వాతి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Updated Date - 2022-03-10T21:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising