ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తియ్యటి వేడుక...

ABN, First Publish Date - 2022-05-27T17:44:32+05:30

రాష్ట్ర మామిడి అభివృద్ధి, మార్కెటింగ్‌ బోర్డు, తోటల అభివృద్ధి శాఖల సం యుక్త నిర్వహణలో బెంగళూరు నగరంలోని లాల్‌బాగ్‌లో శుక్రవారం ప్రారంభమై జూన్‌ 13 వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                          - Bengaluru లాల్‌బాగ్‌లో మామిడి మేళా


బెంగళూరు: రాష్ట్ర మామిడి అభివృద్ధి, మార్కెటింగ్‌ బోర్డు, తోటల అభివృద్ధి శాఖల సంయుక్త నిర్వహణలో బెంగళూరు నగరంలోని లాల్‌బాగ్‌లో శుక్రవారం ప్రారంభమై జూన్‌ 13 వరకు జరుగనుంది. ఈ విషయాన్ని బోర్డు చైర్మన్‌ కేవీ నాగరాజు నగరంలో గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఈ మేళాను ప్రారంభిస్తారని ఇందులో 100కు పైగా మామిడి పండ్ల స్టాల్స్‌, 16 పనసపండ్ల స్టాల్స్‌ ఉంటాయన్నారు. పదిరకాలకు పైగా మామడి పండ్లను తోటల రైతుల నుంచి నేరుగా వినియోగదారుడికి అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1.60 లక్షల హెక్టార్ల ప్రదేశంలో మామిడి తోటల సాగు ఉందని ఈ ఏడాది 14 లక్షల టన్నులు రావచ్చునని అంచనా వేస్తున్నామన్నారు.


30 నుంచి బళ్లారిలో..

బళ్లారి గాంధీనగర్‌: జిల్లా ఉద్యానవన శాఖ, హాప్‌ కామ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆజాది కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఈ నెల 30వ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు తాలూకా కార్యాలయం ఆవరణంలో మామిడి మేళా-2022 నిర్వహిస్తున్నట్లు ఉద్యానవన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పిస్‌పి బోగి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో రైతులు మామిడి పళ్ళను అమ్మడానికి స్టాల్స్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. బళ్లారి, విజయనగర జిల్లాలోతో పాటు చుట్టుప్రక్కల జిల్లాలకు చెందిన మామిడి రైతులు పండ్లను వినియోగదారులకు నేరుగా అమ్ముకోవచ్చన్నారు. ఈ మేళాలో 300కి పైగా మామిడి రకాలను ప్రదర్శనకు ఉంచుతున్నా మని, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు  08392- 278179 కు ఫోన్‌ చేయాలన్నారు.

Updated Date - 2022-05-27T17:44:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising