ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mangaluruకు తొలిసారి మైన్‌లైన్‌ కంటైనర్‌ నౌక

ABN, First Publish Date - 2022-07-05T17:55:54+05:30

నవ మంగళూరు ఓడరేవుకు తొలిసారి మైన్‌లైన్‌ కంటైనర్‌ నౌక చేరుకోవడంతో జల ఫిరంగిలతో సాదరంగా స్వాగతించారు. ఎంఎన్‌సీ ఎర్మీనియా నౌక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నవ మంగళూరు ఓడరేవుకు తొలిసారి మైన్‌లైన్‌ కంటైనర్‌ నౌక చేరుకోవడంతో జల ఫిరంగిలతో సాదరంగా స్వాగతించారు. ఎంఎన్‌సీ ఎర్మీనియా నౌక మంగళూరుకు రావడంపై నౌకాయాన అధికారులు, ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. 276.5 మీటర్‌ల పొడవు కలిగిన నౌక ఆదివారం సాయంత్రం మంగళూరు తీరానికి వచ్చింది. నౌక 1771 ట్వంటీ పోట్‌ ఈక్వెలెంట్‌ యూనిట్‌ (టీఇయూ)తో పాటు 1265 కంటైనర్‌లను రవాణా చేసే సామర్థ్యం కలిగి ఉంది. నవ మంగళూరు పోర్టు అథారిటీ అధ్యక్షులు డాక్టర్‌ అక్కరాజు వెంకట రమణ పచ్చజెండా ఊపి స్వాగతించారు. ఏడైనా మైన్‌లైన్‌ కంటైనర్‌ ఓడరేవుకు వచ్చిందంటే అంతస్థాయిలో సరుకు రవాణాకు సిద్ధగా ఉండాల్సి ఉంటుంది. నవమంగళూరు ఓడరేవులో భారీగా కంటైనర్‌ల మేర సరుకు ఉన్నమేరకే మైన్‌లైన్‌ కంటైనర్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంగళూరు నుంచి దేశవిదేశాలకు భారీగా సరుకు రవాణాకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

Updated Date - 2022-07-05T17:55:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising