ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uttar Pradesh: స్వైన్ ఫ్లూ కలకలం...ఒకరికి పాజిటివ్

ABN, First Publish Date - 2022-07-22T13:34:23+05:30

కరోనా వైరస్, మంకీపాక్స్ వైరస్‌లకు తోడు తాజాగా దేశంలో స్వైన్ ఫ్లూ(swine flu) కేసు ఒకటి వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో(ఉత్తరప్రదేశ్): కరోనా వైరస్, మంకీపాక్స్ వైరస్‌లకు తోడు తాజాగా దేశంలో స్వైన్ ఫ్లూ(swine flu) కేసు ఒకటి వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా(positive for swine flu) తేలింది.స్వైన్ ఫ్లూ సోకిన రోగి దాదాపు 10 రోజులుగా జ్వరం, జలుబు, దగ్గు, వెన్నునొప్పితో బాధపడుతున్నారు.స్వైన్ ఫ్లూ కేసు వెలుగుచూడటంతో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ అలోక్ రంజన్ సూచించారు.ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.దీంతో రాంబాబు అనే రోగిని కాన్పూర్‌లోని రీజెన్సీ ఆసుపత్రిలో చేర్చారు.స్వైన్ ఫ్లూ కేసు వెలుగుచూడటంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) అలోక్ రంజన్ ప్రభుత్వంతో పాటు, ఫతేపూర్ అధికారులకు నివేదిక పంపారు. 


రోగి రాంబాబు కుటుంబాన్ని క్వారంటైన్ చేయాలని డాక్టర్ అలోక్ రంజన్ సూచించారు.ఫతేపూర్ పట్టణంలో పలు పందులు(PIGS) మరణించాయి.ఉత్తరప్రదేశ్‌లో చనిపోతున్న పందుల సంఖ్య మరింత పెరిగింది.దీంతో మునిసిపల్ కార్పొరేషన్ వెటర్నరీ అధికారి మరణించిన పంది మల విసర్జన నమూనాను పరీక్ష కోసం భోపాల్ ల్యాబోరేటరీకి పంపారు.ప్రారంభ దశలో ఈ పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్(African swine fever) సోకిందని అనుమానించారు. దీన్ని నిర్ధారించేందుకు మరణించిన ఐదు పందుల అవయవాలను పరీక్షకు పంపారు.అనుమానిత పందుల నమూనాలను పరిశీలించి నివేదికను సిద్ధం చేసేందుకు పశువైద్యాధికారి నలుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు.4-5 రోజుల నుంచి ఫతేపూర్ సమీప ప్రాంతాల్లో చాలా మంది మరణిస్తున్నారని కమిటీ మెంబర్ కౌన్సిలర్ గిరీష్ చంద్ర తెలిపారు. 


Updated Date - 2022-07-22T13:34:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising