ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kedarnath ముందు కుక్కకు తిలకం.. ఆలయ కమిటీ ఆగ్రహం

ABN, First Publish Date - 2022-05-20T21:00:26+05:30

నోయిడాకు చెందిన వికాస్ త్యాగి(Vikash Tyagi) అనే వ్యక్తి యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. ఇందులో భాగంగా వివిధ ప్రదేశాలు తిరుగుతుంటాడు. తనతో పాటు తన పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్తుంటాడు. ప్రస్తుతం చార్ ధామ్ యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుక్కతో పాటు కేదార్‌నాథ్ వెళ్లాడు త్యాగి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రడూన్: కేదానాథ్(Kedarnath) మందిరానికి కుక్క(dog)ను తీసుకెళ్లిన ఒక వ్లాగర్ చిక్కుల్లో పడ్డాడు. దేవాలయ ఆచారాల ప్రకారం.. పూజారి చేత కుక్కు తిలకం పెట్టించి.. తనతో పాటు ప్రణామాలు చేయించాడు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆలయ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై ఎఫ్ఐఆర్ (FIR) ఫైల్ చేసి చర్యలకు ఆదేశించింది. అంతే కాకుండా ఈ ఘటనను అవమానకరమైనదిగా, అభ్యంతరకరమైనదిగా, ఖండించదగిన చర్యలుగా పేర్కొంది.


వివరాల్లోకి వెళితే... నోయిడాకు చెందిన వికాస్ త్యాగి(Vikash Tyagi) అనే వ్యక్తి యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. ఇందులో భాగంగా వివిధ ప్రదేశాలు తిరుగుతుంటాడు. తనతో పాటు తన పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్తుంటాడు. ప్రస్తుతం చార్ ధామ్ యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుక్కతో పాటు కేదార్‌నాథ్ వెళ్లాడు త్యాగి. తనతో పాటు కుక్క చేత కూడా పూజ చేయించాడు. ఇందులో భాగంగా నందికి నమస్కారం పెట్టించడం, గుడికి ప్రణామాలు చేయించడం లాంటివి చేశాడు. ఇవే కాకుండా ఒక పూజారి చేత కుక్కకు బొట్టు పెట్టించాడు.


దీన్నంతిటినీ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రాంలో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో కింద తన కుక్క మాట్లాడుతున్నట్లు పోస్ట్‌ రాశాడు. 74వేల మంది ఫాలోవర్లు ఉన్న ఈ ఖాతాలో షేర్ చేయడంతో వీడియో వైరల్‌ అయింది. కాగా, ఈ వీడియోపై కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వికాస్ చేసిన పని అవమానకరమైనదిగా, అభ్యంతరకరమైనదిగా, ఖండించదగిన చర్యలుగా పరిగణించింది. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, చర్యలకు సైతం ఆదేశించామని ఆలయ కమిటీ తెలిపింది.

Updated Date - 2022-05-20T21:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising