ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష

ABN, First Publish Date - 2022-03-01T22:25:22+05:30

రెండేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి మరణశిక్ష విధించింది ప్రత్యేక కోర్టు. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడంతోపాటు, హత్య చేశాడు నిందితుడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి మరణశిక్ష విధించింది ప్రత్యేక కోర్టు. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడంతోపాటు, హత్య చేశాడు నిందితుడు. దీంతో అతడికి మరణశిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. గత ఏడాది ఫిబ్రవరి 15న మహారాష్ట్రలోని పుణే జిల్లా, హవేలి తాలూకాలోని వేల్ అనే గ్రామంలో హత్యాచార ఘటన జరిగింది. ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న రెండేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు సంజయ్ బాబన్ కట్కార్ అనే కార్మికుడు. అనంతరం అత్యాచారం చేసి, హత్య చేశాడు. తర్వాత బాలిక మృతదేహాన్ని మాల్ఖేడ్ ప్రాంతం సమీపంలో ఉన్న బ్రిడ్జి దగ్గర పడేశాడు. బాలిక మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఐదు రోజుల తర్వాత నిందితుడు సంజయ్‌ను గుర్తించి అరెస్టు చేశారు. పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) యాక్ట్ కింద, పుణేలో ఏర్పాటైన ప్రత్యేక కోర్టులో విచారణ సాగింది. ఏడాదిపాటు విచారణ అనంతరం నిందితుడికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Updated Date - 2022-03-01T22:25:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising