ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ayodhya : నదిలో స్నానమాచరిస్తూ భార్యకు ముద్దు.. అసభ్యతంటూ భర్తపై దాడి

ABN, First Publish Date - 2022-06-23T14:46:01+05:30

సరయూ నది(Sarayu River)లో పవిత్ర స్నానమాచరిస్తూ భార్యను ముద్దాడిన భర్తపై దాడి జరిగింది. ఉ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయోధ్య : సరయూ నది(Sarayu River)లో పవిత్ర స్నానమాచరిస్తూ భార్యను ముద్దాడిన భర్తపై దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)లోని అయోధ్య(Ayodhya )లో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి. దంపతులు స్నానం చేస్తున్న ప్రదేశానికి సమీపంలోనే ఉన్న పలువురు వ్యక్తులు తొలుత దుర్భాషలాడడం మొదలుపెట్టారు. ఆగ్రహంగా జంట వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి  భర్తను దూరంగా ఈడ్చిపడేశాడు. ఆ తర్వాత భర్తపై దాడికి పాల్పడ్డారు. అయోధ్యలో ఇలాంటి అసభ్యతను సహించబోమంటూ బాధిత వ్యక్తికి హెచ్చరికలు చేశారు.


భర్తకు రక్షణగా నిలబడేందుకు భార్య ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నాలు సఫలమవ్వలేదు. మొత్తానికి దంపతులిద్దరినీ నీళ్లలోంచి ఒడ్డుకు పంపించారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తు జరపాల్సిందిగా అయోధ్య పోలీసు(Police) అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి. కొత్వాలి అయోధ్య పోలిస్ స్టేషన్ ఇన్‌చార్జి ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వైరల్‌గా మారింది.


కాగా గంగా నది(River Ganga) ఉపనదుల్లో సరయూ నది ఒకటి. హిందువులు(Hindus) ఈ నదిని పవిత్రమైనదిగా విశ్వసిస్తారు. రాముడి జన్మభూమి అయోధ్య ఈ నది తీరాన ఉన్న విషయం తెలిసిందే.



Updated Date - 2022-06-23T14:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising