ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతురికి యూనిఫామ్‌ డబ్బులు ఇవ్వలేదని కత్తి పట్టుకుని స్కూల్‌కి వెళ్లిన తండ్రి.. టీచర్లకు వార్నింగ్

ABN, First Publish Date - 2022-07-09T03:39:49+05:30

బిహార్‌(Bhihar)లోని అరారీయా(Araria)లో షాకింగ్ ఘటన జరిగింది. తన కూతురికి స్కూల్ యూనిఫామ్ డబ్బులు రాలేదని ఓ తండ్రి తీవ్రంగా స్పందించాడు. ఓ పెద్ద కత్తితో సంబంధిత స్కూల్లోకి ప్రవేశించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరారీయా, బిహార్ : బిహార్‌(Bhihar)లోని అరారీయా(Araria)లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తన కూతురికి స్కూల్ యూనిఫామ్ డబ్బులు రాలేదని ఓ తండ్రి తీవ్రంగా స్పందించాడు. ఓ పెద్ద కత్తితో సంబంధిత స్కూల్లోకి ప్రవేశించాడు. డబ్బులు ఎందుకివ్వలేదంటూ టీచర్లను బెదిరించాడు. 24 గంటల్లో డబ్బులు ఇవ్వకపోతే మళ్లీ వస్తానని హెచ్చరించాడు.


ఈ ఘటనపై జోకిహట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(SHO) స్పందించారు. స్కూల్ యూనిఫామ్‌ డబ్బులు రానందునే నిందిత వ్యక్తి బెదిరించాడని తేలిందని చెప్పారు. నిందిత వ్యక్తి పేరు అక్బర్‌గా గుర్తించామని, విద్యార్థులంతా తరగతి గదుల్లో ఉన్నప్పుడే ఘటన జరిగిందని చెప్పారు. జోకిహట్ బ్లాక్‌లోని భగ్వాన్‌పూర్ పంచాయతీలో ఈ ఘటన జరిగింది. స్కూల్ హెడ్మాస్టర్ జహంగీర్ ఫిర్యాదు ఆధారంగా నిందిత వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. విషయాన్ని జోకిహట్ బీడీవో దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated Date - 2022-07-09T03:39:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising