ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీకి బేషరతు మద్దతు ప్రకటించిన మమతా బెనర్జీ

ABN, First Publish Date - 2022-02-28T23:35:22+05:30

ప్రస్తుత పరిస్థితి గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. అయితే మన మధ్య రాజకీయంగా ఉన్న విభేధాలను పక్కన పెట్టి జాతి ప్రయోజనాల దృష్ట్యా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇది. ఉక్రెయిన్‌‌లో చిక్కుకుపోయిన భారతీయులను, ముఖ్యంగా విద్యార్థులను వెంటనే స్వదేశానికి రప్పించడంపై మరిన్ని తక్షణ చర్యలు అవసరం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు ఎత్తితినే ఒంటి కాలిపై నిలబడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మొదటిసారి ఆయనకు బేషరతు మద్దతు ప్రకటించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చే విషయంలో ఈ మద్దతు ప్రకటిస్తున్నట్లు సోమవారం రాసిన బహిరంగ లేఖలో ఆమె పేర్కొన్నారు. రాజకీయంగా ఎన్ని వైరాలు ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని లేఖలో మమతా పేర్కొన్నారు.


‘‘ప్రస్తుత పరిస్థితి గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. అయితే మన మధ్య రాజకీయంగా ఉన్న విభేధాలను పక్కన పెట్టి జాతి ప్రయోజనాల దృష్ట్యా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇది.  ఉక్రెయిన్‌‌లో చిక్కుకుపోయిన భారతీయులను, ముఖ్యంగా విద్యార్థులను వెంటనే స్వదేశానికి రప్పించడంపై మరిన్ని తక్షణ చర్యలు అవసరం. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్.. శాంతివైపుకు ప్రపంచాన్ని ముందుకు నడిపే బాధ్యత తీసుకోవాలి. పరస్పర సహకార సమాఖ్య వ్యవస్థలో ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా, ఒక జాతీయ పార్టీ అధినేతగా నేను మీకు (మోదీ) బేషరతు మద్దతును ప్రకటిస్తున్నాను. ఈ మద్దతు స్వీకరించాలని కోరుతున్నాను’’ అని మోదీకి రాసిన లేఖలో మమత పేర్కొన్నారు.

Updated Date - 2022-02-28T23:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising