ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mamata Banerjee In Delhi : ఢిల్లీ పర్యటనకు సీఎం మమతా బెనర్జీ.. రేపు ప్రధాని మోదీతో భేటీ

ABN, First Publish Date - 2022-08-05T03:20:35+05:30

పశ్చిమ బెంగాల్(WestBengal) ముఖ్యమంత్రి(CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) 4 రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ(Delhi) చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్(WestBengal) ముఖ్యమంత్రి(CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) 4 రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ(Delhi) చేరుకున్నారు. షెడ్యూల్‌లో భాగంగా రాష్ట్రపతి(President) ద్రౌపది ముర్ము( Droupadi Murmu), ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)తో శుక్రవారం ఆమె భేటీ కానున్నారు. మోదీతో సమావేశంలో పశ్చిమ బెంగాల్‌కు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలతోపాటు పలు కీలక అంశాలపై ఆమె చర్చించనున్నారని తృణమూల్ వర్గాలు తెలిపాయి. అలాగే ఆగస్టు 7న జరిగనున్న నీతి ఆయోగ్(Niti Aayog) సమావేశంలో కూడా ఆమె పాల్గొంటారు. ప్రతిపక్షాల నేతలతో కూడా భేటీ అయ్యే సూచనలున్నాయి. మనీల్యాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. కాగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు, 2024 లోక్‌సభ ఎన్నికలపై ఆ పార్టీ ఎంపీలతో ఆమె చర్చించారని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ప్రకటించిన 7 జిల్లాలకు పేర్లు పెట్టే విషయంలో సలహాలు-సూచనలు ఇవ్వాలని ఎంపీలను ఆమె కోరారని పేర్కొన్నారు.


ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో నీతి ఆయోగ్ పాలనా మండలి భేటీ జరగనుంది. వ్యవసాయం, వైద్యం, ఆర్థిక వ్యవస్థపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. గతేడాది జరిగే కౌన్సిల్ సమావేశంలో మమతా బెనర్జీ పాల్గొనలేదు. జీఎస్టీ బకాయిలు, సమాఖ్య వ్యవస్థ సమస్యలపై చర్చించే అవకాశాలున్నాయి. ఎంజీఎన్ఆర్‌ఈజీఏకి సంబంధించిన సమస్యలను 48 గంటల్లోగా పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాద్యాయ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో భేటీ అయ్యామని ఆయన చెప్పారు. బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ ఈడీ పహారాలో ఉండడంతో మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడే అవకాశాలు లేవని పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2022-08-05T03:20:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising