ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

I am going to die: సీబీఐ కస్టడీకి పార్థా ఛటర్జీ... నేను చచ్చిపోతానంటూ మాజీ మంత్రి కేకలు..!

ABN, First Publish Date - 2022-09-17T00:26:21+05:30

ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్ కరప్షన్ (SSC recruitment corruption) కేసులో ప్రధాన నిందితుడైన బెంగాల్ విద్యాశాఖ మాజీ మంత్రి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్ కరప్షన్ (SSC recruitment corruption) కేసులో ప్రధాన నిందితుడైన బెంగాల్ విద్యాశాఖ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ (partha chatterjee)ని తదుపరి విచారణ కోసం ఈడీ నుంచి సీబీఐకి (CBI) కోర్టు శుక్రవారంనాడు అప్పగించింది. విచారణ కోసం ఆయనను తమకు అప్పగించాలంటూ కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేయడంతో ఆయన బెయిలు దరఖాస్తును అలిపొరె కోర్టు తోసిపుచ్చింది. సెప్టెంబర్ 21వ తేదీ వరకూ సీబీఐ కస్టడీకి కోర్టు అప్పగించింది. దీంతో ఒక్కసారిగా పార్థా ఛటర్జీ కన్నీంటిపర్యంతమయ్యారు.


''నేను చనిపోవాలనుకుంటున్నాను. నన్ను జైలు నుంచి విడిచిపెట్టండి'' అంటూ ఆయన కోర్టు వెలుపల మీడియా, లాయర్లు, జనం సమక్షంలోనే ఆయన బిగ్గరగా కేకలు వేశారు. దీంతో ఆయన చుట్టూమూగిన  జనాన్ని పోలీసులు పక్కకు తోసుకుంటూ కోర్టు లాకప్ వైపు ఆయనను తీసుకెళ్లారు. ఛటర్జీతో పాటు మధ్య శిక్షా పరిషత్ మాజీ అధ్యక్షుడు కల్యాణ్‌మోయ్ గంగూలీని కూడా కోర్టు లాకప్‌‌కు ఎస్కార్ట్‌తో తీసుకెళ్లారు. గంగూలీని కూడా కోర్టు ఐదు రోజుల పాటు సీబీఐకి అప్పగించింది.


చోర్ చోర్ నినాదాలు..

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పార్థా ఛటర్జీని అలిపొర కోర్టు ముందు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలీసులు హాజరపరిచారు. విచారణ పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను కోర్టు బయటకు తీసుకువస్తుండగా కొందరు ''దొంగ దొంగ'' అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Updated Date - 2022-09-17T00:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising