ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Agnipath Scheme: 65 ఏళ్లకు పదవీ విరమణ: Mamata Banerjee డిమాండ్

ABN, First Publish Date - 2022-06-28T01:40:36+05:30

అగ్నిపథ్ పథకం (Agnipath scheme) కింద రిక్రూట్ చేసే సైనికుల పదవీ విరమణ వయస్సును నాలుగేళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: అగ్నిపథ్ పథకం (Agnipath scheme) కింద రిక్రూట్ చేసే సైనికుల పదవీ విరమణ వయస్సును నాలుగేళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కేంద్రాన్ని కోరారు. అగ్నివీరులుగా రిక్రూట్ అయిన వారు నాలుగేళ్ల కాలం పూర్తయిన తర్వాత అనిశ్చితమైన భవిష్యత్‌ను చూడాల్సి వస్తుందని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం న్యూ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను తెచ్చిందని విమర్శించారు.


''బీజేపీలాగా కాకుండా యువతకు విరివిగా ఉద్యోగాలు సృష్టించాలన్నదే నా ఉద్దేశం. వాళ్లు నాలుగు నెలలు శిక్షణ ఇచ్చి నాలుగేళ్లు కాలం కోసం రిక్రూట్ చేస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత ఈ సైనికులు ఏం చేస్తారు? వారి భవిష్యత్ ఏమిటి. ఇది పూర్తిగా అనిశ్చితమైన పరిస్థితి'' అని మమతాబెనర్జీ విమర్శించారు. పదవీ విరమణ వయస్సును 65కు పొడిగించాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సొంత ఆర్మీని తయారు చేసుకునేందుకే నూతన డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని ఇంతకుముందు మమతా బెనర్జీ ఆరోపించారు.

Updated Date - 2022-06-28T01:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising