ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra: Srikanth Deshmukhపై లైంగిక ఆరోపణలు.. పదవి నుంచి తొలగించిన BJP

ABN, First Publish Date - 2022-07-13T21:21:01+05:30

షోలాపూర్ (Sholapur) బీజేపీ రూరల్ జిల్లా షోలాపూర్ బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్ దేశ్‌ముఖ్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధిష్టానం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (Mumbai): మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. షోలాపూర్ (Sholapur) బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ దేశ్‌ముఖ్‌ (Srikanth Deshmukh)పై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ (BJP) అధిష్టానం ఆయనను పదవి నుంచి తొలగించింది. శ్రీకాంత్ దేశ్‌ముఖ్‌పై సొంతపార్టీ మహిళా కార్యకర్త అయిన నిర్మలా యాదవ్ (Nirmala Yadav) లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపింది. శ్రీకాంత్ తనను ఓ హోటల్‌లో బంధించి లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ ఆమె ఓ వీడియో క్లిప్‌ (Video clip)ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ అధిష్టానం శ్రీకాంత్‌ను రాజీనామా చేయమని కోరింది. దీంతో ఆయన నిన్న రాజీనామా చేయగా.. అధిష్టానం రాజీనామాను ఆమోదించింది. షోలాపూర్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిన ఈ ఘటనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్ దేశ్‌ముఖ్‌ను ట్రాష్ చేసి.. కావాలనే ఇందులో ఇరికించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.


బీజేపీ కార్యకర్తగా ఉన్న నిర్మాలా యాదవ్ గతంలో కూడా ఇలాంటి వివాదాలను తెరపైకి తెచ్చినట్లుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిర్మాలా యాదవ్ పలుమార్లు బ్లాక్ మెయిల్‌ (Black mail)కు కూడా దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వీడియో క్షుణ్ణంగా పరిశీలిస్తే నిర్మాలా యాదవ్ కావాలనే ఆ వీడియో తీసినట్లుగా అర్థమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో దోషులను వదిలిపెట్టేదిలేదని మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు చిత్రా వాగ్ (Chitra Wagh) తెలిపారు. ఈ ఘటనలో భిన్నాభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నందున నిర్మాలా యాదవ్ ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చిత్రా వాగ్ అన్నారు. మరోవైపు నిర్మాలా యాదవ్ తనను హనీ ట్రాప్ చేసిందని శ్రీకాంత్ దేశ్‌ముఖ్ అన్నారు. నిర్మాలా యాదవ్‌పై దోపిడీ నేరం కింద ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు రోజుల క్రితం దేశ్‌ముఖ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఇంత వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఘటనలో మున్ముందు ఏం జరగబోతోందన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - 2022-07-13T21:21:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising