ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra Political Crisis: ‘మహా’ సంక్షోభంలో మరో ట్విస్ట్.. ఆసక్తి రేపుతున్న ఈ రెండు పరిణామాలు..

ABN, First Publish Date - 2022-06-26T21:40:53+05:30

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. శివసేనలో ఏక్‌నాథ్ షిండే వెంట నడిచిన రెబల్ ఎమ్మెల్యేల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Maharashtra Political Crisis) థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. శివసేనలో (Shivsena) ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వెంట నడిచిన రెబల్ ఎమ్మెల్యేల్లో (Rebel MLAs) కొందరు ఉద్ధవ్ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 20 మంది రెబల్ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharashtra CM) ఉద్ధవ్ ఠాక్రేతో (Uddhav Thackeray) టచ్‌లో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా మరో తాజా పరిణామం కూడా చోటుచేసుకుంది. ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) క్యాంపులోని రెబల్ ఎమ్మెల్యేలు (Rebel MLAs) బస చేస్తున్న గౌహతిలోని (Gauhati) రాడిసన్ బ్లూ హోటల్‌లోనే (Radison Blue Hotel) ఉద్ధవ్ వర్గం (Uddhav Faction) తాజాగా 20 రూమ్‌లు బుక్ చేసినట్లు తెలిసింది. ఉద్ధవ్ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలను కూడా అక్కడికే తరలించి రెబల్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేలా ఉద్ధవ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో కూడా ఉద్ధవ్ భార్య మంతనాలు సాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉద్ధవ్ ఇలా శరవేగంగా పావులు కదుపుతున్న తరుణంలోనే మరో ఎమ్మెల్యే ఆయనకు షాకిచ్చినట్లు తెలిసింది.



ఉద్ధవ్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన ఒక ఎమ్మెల్యే షిండే క్యాంపులో చేరేందుకు గౌహతి వెళ్లినట్లు సమాచారం. రెండు రోజుల క్రితమే ఏక్‌నాథ్ షిండే క్యాంపులో చేరేందుకు సదరు మంత్రి రంగం సిద్ధం చేసుకున్నారని, పలు కారణాల వల్ల ఆలస్యంగా గౌహతికి బయల్దేరి వెళ్లారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఈ మొత్తం పరిణామాల వెనుక బీజేపీ (BJP) ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో అస్సోం బీజేపీ మంత్రి అశోక్ సింఘాల్ (Ashok Singhal) గౌహతిలోని ఆ లగ్జరీ హోటల్‌కు వెళ్లి షిండే క్యాంపులోని రెబల్ ఎమ్మెల్యేలతో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఉద్ధవ్ వర్గానికి మంత్రి ఉదయ్ సామంత్ (Uday Samanth) ఝలక్ ఇచ్చారు. షిండే క్యాంపులో చేరేందుకు మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ (Uday Samanth) గౌహతికి (Gauhati) వెళ్లారు. ఉదయ్ సామంత్‌తో కలిపి ఇప్పటివరకూ 8 మంది మంత్రులు షిండే క్యాంపులో (Shinde Camp) చేరారు.

Updated Date - 2022-06-26T21:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising