ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mumbai లోకల్ రైళ్లలో మాస్క్ తప్పనిసరి...సర్కారు ఉత్తర్వులు

ABN, First Publish Date - 2022-06-25T14:29:45+05:30

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముంబై లోకల్ రైళ్లలో(Mumbai Local Trains) ప్రయాణికులు మాస్క్ ధరించడం తప్పనిసరి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి:మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముంబై లోకల్ రైళ్లలో(Mumbai Local Trains) ప్రయాణికులు మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. సబర్బన్ రైలు ప్రయాణికులకు ఫేస్ మాస్క్‌లను తప్పనిసరి చేసినట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం సీనియర్ ప్రభుత్వ అధికారులతో కొవిడ్ (COVID-19) పరిస్థితిపై చర్చించారు. కరోనా పెరుగుతున్న కేసుల దృష్ట్యా ముంబై సబర్బన్ రైళ్లలో మళ్లీ ఫేస్ మాస్క్‌లను తప్పనిసరి చేశారు.ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో పెరుగుతున్న కరోనావైరస్ ఇన్ఫెక్షన్ కేసులను అరికట్టడానికి ఒక చర్యగా మాస్క్ మ్యాండేట్ చేశారు.


మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ప్రారంభంలో మాస్క్ తప్పనిసరి అనే నియమాన్ని ఉపసంహరించుకుంది. మహారాష్ట్రలో ప్రధానంగా ముంబై, థానే, పూణే, రాయ్‌గఢ్, పాల్ఘార్ జిల్లాల్లో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు తమంతట తాముగా కొవిడ్-19-మార్గదర్శకాలు అనుసరించాలని సీఎం ప్రకటనలో కోరారు.మహారాష్ట్రలో శుక్రవారం 4,205 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 5,000 మార్కును దాటిన ఒక రోజు తర్వాత కొత్త కేసుల్లో ఒక్క ముంబైలోనే 1,898 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 25,000 దాటింది. 

Updated Date - 2022-06-25T14:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising