ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని నరేంద్ర మోదీని చంపగలను..మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-01-18T12:56:08+05:30

మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపగలనని నానా పటోలే వ్యాఖ్యానించారు. భండారా జిల్లాలోని లఖానీ తహసీల్ జిల్లాపరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు ముందు జరిపిన ప్రచార సమావేశంలో మాట్లాడుతూ నానా పటోలే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను కానీ ఒక్క స్కూల్ కూడా నా పేరు మీద లేదు.. ఎప్పుడూ అందరికీ సాయం చేశాను.. మోదీని చంపగలను.. ఆయనను దూషించగలను... అందుకే మోదీ నాకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు’’ అని నానాపటోలే అన్నారు. నానాపటోలే వ్యాఖ్యలను మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. 


‘‘ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్ ను 20 నిమిషాల పాటు నిలిపివేశారు, ఇప్పుడేమో మోదీని చంపగలనని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానాపటోలే వ్యాఖ్యానించారు’’ అని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.మహారాష్ట్రలోని ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఒక మహిళను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది.రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించడంతోపాటు ఇతర కీలక పరిణామాలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని నానా పటోలే చెప్పారు.


Updated Date - 2022-01-18T12:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising