ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cabinet status: క్రీడాకారులకు క్యాబినెట్‌ హోదా భద్రత

ABN, First Publish Date - 2022-07-27T15:07:16+05:30

మహాబలిపురంలో జరుగనున్న చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) కోసం వచ్చే దేశవిదేశ క్రీడాకారులకు క్యాబినెట్‌ మంత్రికి కల్పించే భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                   - డ్రోన్‌ కెమెరాలతో మహాబలిపురంపై డేగ కన్ను


పెరంబూర్‌(చెన్నై), జూలై 26: మహాబలిపురంలో జరుగనున్న చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) కోసం వచ్చే దేశవిదేశ క్రీడాకారులకు క్యాబినెట్‌ మంత్రికి కల్పించే భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్రీడాకారులు బస చేసే హోటళ్లు, వారు పర్యటించే ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. క్రీడాకారులు ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా పోలీసు ఎస్కార్ట్‌ ఉండేలా చర్యలు తీసుకున్నారు. మహాబలిపురం సముద్రతీరంలో 150 మంది పోలీసులు మోహరించగా, క్రీడాకారులు బస చేసే హోటళ్లన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నారు.

డ్రోన్లతో నిఘా మహాబలిపురం(Mahabalipuram) పరిసర ప్రాంతాలను పోలీసులు డ్రోన్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ సుగుణాసింగ్‌ మాట్లాడుతూ... మహాబలిపురం బీచ్‌(Mahabalipuram Beach), పరిసర ప్రాంతాల్లో దట్టమైన చెట్లు, పొదలు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు దాగే అవకాశముందన్నారు. అందువల్ల ఐదుగురు పోలీసులతో కూడిన బృందం 24 గంటలు డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షించనుందని తెలిపారు. డ్రోన్‌ కెమెరా(Drone camera) దృశ్యాలు కంట్రోల్‌ రూమ్‌ నుంచి స్వయంగా వీక్షించేలా ఏర్పాటుచేశామన్నారు. మహాబలిపురం బీచ్‌లో మూడు, చెస్‌ ఒలింపియాడ్‌ పోటీలు జరిగే ప్రాంతాన్ని అత్యాధునిక రెండు డ్రోన్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Updated Date - 2022-07-27T15:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising