Mahabalipuram: మహాబలిపురంలో బౌద్ధ సన్యాసుల సందడి
ABN, First Publish Date - 2022-12-22T10:30:58+05:30
ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంలో యువ బౌద్ధ సన్యాసులు సందడి చేశారు. అరుణాచల్‌ప్ర
పెరంబూర్(చెన్నై), డిసెంబరు 21: ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంలో యువ బౌద్ధ సన్యాసులు సందడి చేశారు. అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, అసోం, త్రిపుర, మణిపూర్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్లస్ టూ పూర్తిచేసిన 50 మంది కళాశాల విద్యార్థులు ప్రస్తుతం బౌద్ధ మతం స్వీకరించారు. వీరు బెంగుళూరులోని ఓ మఠంలో శిక్షణ పొందుతున్నారు. వీరంతా బుధవారం మహాబలిపురం(Mahabalipuram) చేరుకొని అర్జున తపస్సు, పంచ రథాలు, వెన్నముద్ద రాయి తదితరాలు సందర్శించారు.
Updated Date - 2022-12-22T10:30:59+05:30 IST