ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra తర్వాతి CM ఎన్సీపీ నుంచేనట!

ABN, First Publish Date - 2022-06-06T01:50:13+05:30

సామాజిక న్యాయ శాఖ రేపు ఎవరికి ఇస్తారనే ప్రశ్న తలెత్తొచ్చు. ఈ ప్రశ్న ఇది వరకు కూడా వచ్చింది. కానీ ఆ శాఖ మా(ఎన్సీపీ) వద్ద మాత్రమే ఉండాలని ముఖ్యమంత్రి(ఉద్ధవ్ థాకరే) చెప్పారు. ఎందుకంటే అత్యుత్తమంగా పని చేసి ఆ శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చాం. అలాగే తర్వాతి ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న రావొచ్చు. అది కూడా మేమే(ఎన్సీపీ) అవుతుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర(Maharashtra)కు తర్వాతి కాబోయే ముఖ్యమంత్రి(chief minister) శరద్ పవార్(Sharad Pawar) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(Nationalist Congress Party) నుంచేనని ఆ పార్టీ నేత, మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే(Dhananjay Munde) అన్నారు. శనివారం రాష్ట్రంలోని పర్బానిలో ఏర్పాటు చేసిన ఓ కర్యాక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు కేటాయించిన సామాజిక న్యాయ శాఖలో తాను ఉత్తమంగా పని చేయడం వల్లే ఆ శాఖకు మంచి పేరు వచ్చిందని, అలాగే ప్రతిపక్ష నేతగా తాను ప్రభుత్వాన్ని గడగడలాయించానని ఆయన అన్నారు.


‘‘సామాజిక న్యాయ శాఖ రేపు ఎవరికి ఇస్తారనే ప్రశ్న తలెత్తొచ్చు. ఈ ప్రశ్న ఇది వరకు కూడా వచ్చింది. కానీ ఆ శాఖ మా(ఎన్సీపీ) వద్ద మాత్రమే ఉండాలని ముఖ్యమంత్రి(ఉద్ధవ్ థాకరే) చెప్పారు. ఎందుకంటే అత్యుత్తమంగా పని చేసి ఆ శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చాం. అలాగే తర్వాతి ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న రావొచ్చు. అది కూడా మేమే(ఎన్సీపీ) అవుతుంది. ఆ పదవికి అత్యంత పేరు ప్రతిష్టలు మేము తీసుకురాగలం’’ అని ధనుంజయ్ అన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం ఏర్పడి గత నెలకు రెండున్నరేళ్లు పూర్తైంది. అంతకు ముందు ప్రభుత్వంలో ధనుంజయ్ ముండే ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

Updated Date - 2022-06-06T01:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising