ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్ ధరలు మావల్ల పెరగలేదు: మహా సీఎం ఉద్ధవ్ థాకరే

ABN, First Publish Date - 2022-04-27T22:50:22+05:30

డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం 22.37 రూపాయల పన్ను వసూలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం 24.38 రూపాయలు వసూలు చేస్తోంది. ఇక పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం 32.55 రూపాయలు వసూలు చేస్తోంటే.. కేంద్ర ప్రభుత్వం 31.58 రూపాయలు వసూలు చేస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పెట్రోలు, డీజిల్‌లపై వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్)ను తగ్గించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వమే ఇష్టారీతిన పన్నులు వసూలు చేస్తూ రాష్ట్రాలను తగ్గించమనడం ఏంటని పేర్కొన్నారు. కేంద్రం, మహారాష్ట్ర వసూలు చేస్తున్న పన్నుల గురించి బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.


ఈ వివరాల ప్రకారం.. ‘‘డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం 22.37 రూపాయల పన్ను వసూలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం 24.38 రూపాయలు వసూలు చేస్తోంది. ఇక పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం 32.55 రూపాయలు వసూలు చేస్తోంటే.. కేంద్ర ప్రభుత్వం 31.58 రూపాయలు వసూలు చేస్తోంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం వల్ల పెట్రోల్ రేట్లు పెరగడం లేదు. ఇప్పటికే మహారాష్ట్ర పౌరులకు సహజ వాయువు వినియోగంపై 13.5శాతం ఉపశమనం కల్పించాం’’ అని సీఎం ఉద్ధవ్ థాకరే అన్నట్లు మహా సీఎంవో పేర్కొంది.

Updated Date - 2022-04-27T22:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising