ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్విస్ట్:మహారాష్ట్ర రైతు జన్‌ధన్ ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ...ఆ తర్వాత ఏమైందంటే...

ABN, First Publish Date - 2022-02-10T17:18:49+05:30

మహారాష్ట్రాకు చెందిన ఓ రైతు బ్యాంకు జన్‌ధన్ ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ చేసిన ఘటన సంచలనం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

6నెలల తర్వాత పొరపాటున వేశామని బ్యాంకు నోటీసు


ఔరంగాబాద్ (మహారాష్ట్ర): మహారాష్ట్రాకు చెందిన ఓ రైతు బ్యాంకు జన్‌ధన్ ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ చేసిన ఘటన సంచలనం రేపింది.మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని పైథాన్ తాలూకాకు చెందిన జ్ఞానేశ్వర్ ఓటే అనే రైతుకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులోని  జన్ ధన్ ఖాతాలో 2021 ఆగస్టు నెలలో రూ. 15 లక్షలు జమ అయ్యాయి. దీంతో రైతు జ్ఞానేశ్వర్ ఓటే ఎంతో సంతోషించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తున్నారని భావించి ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ జ్ఞానేశ్వర్ ఓటే లేఖ కూడా రాశారు.


రైతు తన ఖాతా నుంచి 9 లక్షలరూపాయలను విత్ డ్రా చేసి ఇల్లు కట్టుకున్నాడు. అంతే 6 నెలల తర్వాత, రైతు బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.15లక్షలు వేశామని బరోడా బ్యాంకు రైతుకు నోటీసు ఇచ్చింది.దీంతో రైతు షాక్‌కు గురయ్యాడు. ఆరు నెలల తర్వాత బ్యాంకు తాము పొరపాటుగా వేశామని చెప్పింది.ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని బ్యాంకు కోరింది.బ్యాంకు పంపిన నోటీసుతో రైతు కలలు కల్లలయ్యాయి. ఆ మొత్తాన్ని పూర్తిగా వాపసు చేయమని బ్యాంకు కోరింది.వాస్తవానికి పింపల్‌వాడి గ్రామపంచాయతీ అభివృద్ధికి ఆ నిధులు కేటాయించినట్లు తేలింది. 


నాలుగు నెలల తర్వాత గ్రామపంచాయతీకి జ్ఞానేశ్వర్‌ ఓటే ఖాతాలో వినియోగానికి సంబంధించిన డబ్బులు జమ అయినట్లు గుర్తించింది.ప్రధాని మోదీ తన జన్ ధన్  ఖాతాలోకి డబ్బు పంపారని భావించి ఖర్చు చేశానని రైతు జ్ఞానేశ్వర్ ఓటే చెప్పారు. మిగిలిన రూ.6 లక్షలు తిరిగి బ్యాంకుకు చెల్లించగా, ఇంటి నిర్మాణానికి వెచ్చించిన రూ.9 లక్షలను రైతు ఇంకా చెల్లించలేదు.


Updated Date - 2022-02-10T17:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising