ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యమా?

ABN, First Publish Date - 2022-02-02T14:20:19+05:30

నగరపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన సమయంలో ఐపీఎస్‌ అధికారులను బదలీ చేయడాన్ని సవాలు చేస్తూ అన్నాడీఎంకే తరఫున దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఇది ప్రజా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకునేలా ఉంది

- ఐపీఎస్‌ల బదిలీల వ్యవహారంలో అన్నాడీఎంకే పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం


చెన్నై: నగరపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన సమయంలో ఐపీఎస్‌ అధికారులను బదలీ చేయడాన్ని సవాలు చేస్తూ అన్నాడీఎంకే తరఫున దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యంలా లేదని, ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకునే వ్యాజ్యంలా వుందని కటువుగా వ్యాఖ్యానించింది. న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు తమ సమయం వృధా చేసినందుకు పిటిషనర్‌కు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌నాథ్‌ భండారీ, జస్టిస్‌ ఆదికేశవులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్‌ అధికారు బదిలీని సవాల్‌ చేస్తూ అన్నాడీఎంకే ఎన్నికల విభాగం కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఇన్బదురై  ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులను బదిలీ చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికే ఉంటుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం 17 మంది ఐపీఎస్‌ అధికారులను బదలీచేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందికే వస్తుందని, ఆ బదలీలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారులకు- ఎన్నికల విధులకు ఏమాత్రం సంబంధం లేదని, పాలనా సౌలభ్యం కోసమే ఆ బదలీలు జరిగాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. బదలీ అయిన ఐపీఎస్‌ అధికారులపై ఏమైనా అనుమానాలుంటే పిటిషనర్‌ ఎన్నికల సంఘాన్ని సంప్రదించవచ్చని సూచించింది. ఈ విషయంలో కోర్టుకు వచ్చేందుకు పిటిషనర్‌కు వున్న అర్హతలేంటని ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్‌ ఇన్బదురై వృత్తిరీత్యా న్యాయవాది కాగా, అన్నాడీఎంకే ఎన్నికల విభాగం కార్య దర్శిగా ఉన్నారని తేలడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదులు ప్రజా ప్రయోజన వాజ్యం వేయకూడదని సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించిందని, ఈ విషయం న్యాయవాదిగా ఉన్న ఇన్బదురైకి తెలిసే ఇలా చేయడం గర్హనీయమని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలా కోర్టు సమయం వృధా చేసినందుకు పిటిషనర్‌కు జరిమానా విధించడంతో పాటు పిటిషన్‌ను తోసిపుచ్చుతామని పేర్కొనగా, పిటిషనర్‌ తరఫు న్యాయవాది దానిని తాము ఉపసంహరించు కుంటామని అభ్యర్థించారు. 

Updated Date - 2022-02-02T14:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising