ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhya Pradeshలో హిజాబ్ ధరించిన ఇద్దరు బాలికలను చుట్టుముట్టి జైశ్రీరాం నినాదాలు చేసిన యువకులు

ABN, First Publish Date - 2022-02-16T13:02:48+05:30

హిజాబ్ వివాదం బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పాకింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యప్రదేశ్‌కు పాకిన హిజాబ్ వివాదం

భోపాల్ : హిజాబ్ వివాదం బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పాకింది.బురఖా, హిజాబ్ ధరించిన ఇద్దరు బాలికలు దతియా పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలోకి ప్రవేశించడాన్ని చూసిన కొందరు వ్యక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో కనిపించడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించే ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా పునరుద్ఘాటించారు.బురఖా, హిజాబ్ ధరించిన ఇద్దరు బాలికలు దతియాలోని ప్రభుత్వ పోస్ట్-గ్రాడ్యుయేట్ కళాశాల క్యాంపస్‌లోకి ప్రవేశించడాన్ని చూసిన కొంతమంది యువకులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం వైరల్ వీడియో క్లిప్‌లో కనిపించింది. 


విద్యార్థినులు హిజాబ్‌తో సహా మతపరమైన దుస్తులు ధరించడాన్ని నిషేధిస్తూ కళాశాల ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.‘‘దతియా మత సామరస్యానికి సజీవ ఉదాహరణ. నేను దతియా పీజీ కళాశాల వీడియోను చూశాను. దాని ప్రిన్సిపాల్ జారీ చేసిన ఉత్తర్వులపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాను. హిజాబ్‌ను నిషేధించే ప్రతిపాదన లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో ఎవరూ ఈ అంశంపై గందరగోళం సృష్టించవద్దు’’ అని దాతియా ఎమ్మెల్యే మిశ్రా ఒక వీడియో ప్రకటనలో తెలిపారు.దతియా పీజీ కళాశాల క్యాంపస్‌ను హిందూకార్యకర్తలు ఆకస్మికంగా సందర్శించారని, కొంతమంది విద్యార్థులు బురఖా, హిజాబ్ ధరించి అక్కడికి చేరుకున్నారని, ఇది రాజ్యాంగం ప్రకారం కాదని భజరంగ్ దళ్ కార్యకర్త అజయ్ సింగ్ రాజ్ ఆరోపించారు.


ఈ ఘటనపై విచారణకు ఆదేశించినందుకు రాష్ట్ర హోంమంత్రికి భోపాల్ (సెంట్రల్) కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ కృతజ్ఞతలు తెలిపారు.క్యాంపస్‌లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించే విషయమై ఎటువంటి ప్రతిపాదన లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినందున, ఈ విషయంలో విద్యా సంస్థలు ఎటువంటి గందరగోళాన్ని మనస్సులో పెట్టుకోవద్దని ఎమ్మెల్యే ఆరిఫ్ అన్నారు. ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన ప్రజలను కోరారు.


Updated Date - 2022-02-16T13:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising