ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhya pradesh: ఉత్త చేతులతో మరుగుదొడ్డి కడిగిన బీజేపీ ఎంపీ

ABN, First Publish Date - 2022-09-23T23:29:44+05:30

మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా శుక్రవారంనాడు బాలికల పాఠశాలలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya pradesh) బీజేపీ ఎంపీ (Bjp Mp) జనార్దన్ మిశ్రా (Janardan Mishra) శుక్రవారంనాడు బాలికల పాఠశాలలో ఉత్త చేతులతో మరుగుదొడ్డి  (Toilet) శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో రావడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. బీజేపీ యువ మోర్చా నిర్వహిస్తున్న 'సేవా పఖ్వాడా'లో భాగంగా ఖట్ఖారి బాలికల పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నట్టు జనార్దన్ మిశ్రా ఓ ట్వీట్‌లో తెలిపారు.


ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజైన సెప్టెంబర్ 17న యువజన విభాగం ప్రారంభించిన సేవా కార్యక్రమాలు మహాత్మాగాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 వరకూ కొసాగనున్నాయి. ఇందులో భాగంగా రేవాలోని బాలికల పాఠశాలలో చెట్లు నాటే కార్యక్రమంలో మిశ్రా పాల్గొన్నారు. టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నట్టు గమనించిన ఎంపీ వెంటనే దానిని శుభ్రం చేశారు. మహాత్మాగాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని అందిపుచ్చుకుని పరిసరాల పరిశుభ్రత కోసం పాటుపడటం ప్రతి ఒక్కరి బాధ్యతని, తొలిసారి తాను ఈ క్లీన్లీనెస్ డ్రైవ్‌లో పాల్గొన్నానని చెప్పారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 2వ తేదీని స్వచ్ఛభారత్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ మిషన్ కింద దేశంలోని గ్రామాలు, పంచాయతీలు, జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను 2019 అక్టోబర్ 2న గాంధీ 150వ జయంతి నాటికి బహిరంగ విసర్జన రహితంగా మార్చాలంటూ లక్ష్యం నిర్దేశించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 మిలియన్లకు పైకా టాయెలెట్లు నిర్మించినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-09-23T23:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising