ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhurai ఆలయ ప్రాంగణంలో ఆస్పత్రి

ABN, First Publish Date - 2022-06-21T15:56:16+05:30

మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకొనే సమయంలో అస్వస్థతకు గురైన భక్తులకు అత్యవసర చికిత్స అందించేలా హిందూ దేవాదాయ శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 20: మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకొనే సమయంలో అస్వస్థతకు గురైన భక్తులకు అత్యవసర చికిత్స అందించేలా హిందూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఏర్పాటుకానుంది. ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఈ ఆలయానికి ప్రతిరోజు సుమా రు 50 వేల మందికి పైగా భక్తులు వస్తున్నారు. దర్శనం కోసం ఎక్కువ సేపు క్యూలైన్లలో వేచి ఉన్న పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోవడం, గుండెపోటుకు గురికావడంతో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో, ఆలయ ప్రాంగణంలో ఆస్పత్రి ఏర్పాటుచేయాలని హిందూ దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ విషయమై ఆలయ నిర్వహణాధికారి ఒకరు మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్ధం ఆస్పత్రి ఏర్పాటుచేయాలని రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు, నర్సులు, సహాయకులు, సిబ్బందిని నియమిస్తారని, అస్వస్థతకు గురైన భక్తులకు ప్రాథమిక చికిత్స అందించి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తామని తెలిపారు. ఆలయంలోని ఓ భవనంలో పడక వసతితో ఆస్పత్రి ఏర్పాటుకానుందన్నారు. వైద్యులు, నర్సుల పోస్టులకు హిందూ మతానికి చెందిన రాష్ట్ర పౌరులు అర్హులని, ఆసక్తి కలిగిన వారు www.maduraimee nakshi.org, www.tnhrce.gov.in అనే వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

Updated Date - 2022-06-21T15:56:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising