ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

M. Rajendran: కాలాపానీ రచయితకు కేంద్ర సాహిత్య పురస్కారం

ABN, First Publish Date - 2022-12-23T10:24:17+05:30

‘కాలాపానీ’ నవలా రచయిత ఎం.రాజేంద్రన్‌(M. Rajendran)కు సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. కాలైయార్‌కోయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘కాలాపానీ’ నవలా రచయిత ఎం.రాజేంద్రన్‌(M. Rajendran)కు సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. కాలైయార్‌కోయిల్‌ పోరాటం ఆధారంగా ఐఏఎస్‌ అధికారి రాజేంద్రన్‌ కాలా పానీ నవల రచించారు. ఆ కాలంలో తమిళుల జీవన విధానం, పరిస్థితులు, ఆంగ్లేయుల ఆరాచకాలు తదితరాలు ఈ నవలలో చోటుచేసుకున్నాయి. ఈ నవలకు సంబంధించి ఆయన పలు దేశవిదేశీ పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు సాహిత్య పురస్కారం రావడంపై రాజేంద్రన్‌ స్పందిస్తూ... ఈ నవలను కరోనా సమయంలో శివగంగలో ఆవిష్కరించామన్నారు. ప్రస్తుతం యువత పుస్తక పఠనంపై ఆసక్తి చూపుతున్నారని, ముఖ్యంగా చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలో వారు ఎంతో ఉత్సాహంగా వున్నారన్నారు. కాలాపానీ నవలకు తగిన గుర్తింపు వస్తుందని తాను ముందే ఊహించానన్నారు. సాహిత్య అకాడమీ పురస్కారం రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాజేంద్రన్‌ తమిళనాడు సహకార సంఘ ఎన్నికల కమిషనర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. కాగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన రాజేంద్రన్‌ను సీఎం స్టాలిన్‌ అభినందించారు.

Updated Date - 2022-12-23T10:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising