ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

central jailలో ఖైదీల మధ్య ఘర్షణ...ఖైదీకి గాయాలు

ABN, First Publish Date - 2022-06-03T13:17:33+05:30

లుధియానా సెంట్రల్ జైలులో రెండు ఖైదీ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఖైదీ గాయపడ్డాడు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లుధియానా(పంజాబ్): లుధియానా సెంట్రల్ జైలులో రెండు ఖైదీ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఖైదీ గాయపడ్డాడు.జైలులోని డి-అడిక్షన్ సెంటర్ వద్ద రెండు ప్రత్యర్థి గ్రూపులు ఘర్షణ పడ్డాయని జైలు అధికారులు చెప్పారు.ఈ ఘర్షణ అనంతరం పోలీసు కమీషనర్ శర్మ నేతృత్వంలోని పోలీసు బృందం లూథియానా జైలు బ్యారక్‌లో కూడా సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో జైలులోని ఖైదీల వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.శుభమ్ అరోరా అలియాస్ మోటా అనే ఖైదీపై ప్రత్యర్థి బృందం సభ్యులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో అతన్ని వైద్య పరీక్షల కోసం సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 


అరోరా శరీరంపై కనీసం ఎనిమిది గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.లూథియానాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు అరోరా, మరో యూత్ కాంగ్రెస్ నాయకుడు అంకిత్ పండిట్ వారి సహాయకుడు గౌరవ్ బిష్త్ లు హత్యాయత్నం కేసులో అరెస్టయి జైలులో ఉన్నారు.జైలులోని డి-అడిక్షన్ సెంటర్ నుంచి ఘర్షణ ప్రారంభమైందని లూథియానా పోలీస్ కమిషనర్ కౌస్తుభ్ శర్మ తెలిపారు.


Updated Date - 2022-06-03T13:17:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising