ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Queen Elizabeth II Funeral : జో బైడెన్‌ను ఎగతాళి చేసిన డొనాల్డ్ ట్రంప్

ABN, First Publish Date - 2022-09-20T22:47:30+05:30

మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియల సందర్భంగా అమెరికా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కు సరైన గౌరవం లభించలేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మండిపడ్డారు. బైడెన్‌కు 14వ వరుసలో సీటును కేటాయించడంపై వ్యంగ్యంగా స్పందిస్తూ, ‘ఉన్న చోటు ముఖ్యం’ అన్నారు. రెండేళ్లలో ఈ మార్పు వచ్చిందన్నారు. 


క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు సెప్టెంబరు 19న లండన్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నేతలు, యూరోపియన్ ఫ్యామిటీ మెంబర్స్ హాజరయ్యారు. బ్రిటన్‌ను సుదీర్ఘ కాలం మహారాణిగా పరిపాలించిన ఎలిజబెత్-2కు తుది వీడ్కోలు పలికారు.  ఈ కార్యక్రమంలో  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 14వ వరుసలో సీటును కేటాయించారు. 


ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ (Truth Social)లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘కేవలం రెండేళ్ళలో అమెరికాకు జరిగినది ఇది. గౌరవం లేదు’’ అని పేర్కొన్నారు. రాజకీయాలు, జీవితంలో మాదిరిగానే రియల్ ఎస్టేట్‌లో కూడా ఉన్న చోటు ముఖ్యం అన్నారు. 


క్వీన్ ఎలిజబెత్ -2 సెప్టెంబరు 8న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమెకు నివాళులర్పించేందుకు జో బైడెన్, తన సతీమణి జిల్‌తో కలిసి లండన్ వెళ్ళారు. 


Updated Date - 2022-09-20T22:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising