Liz Truss: బ్రిటన్ తదుపరి ప్రధానిగా లిజ్ ట్రస్
ABN, First Publish Date - 2022-09-05T23:02:27+05:30
బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం భారత సంతతికి చెందిన రిషి సునాక్- కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ మధ్య
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం భారత సంతతికి చెందిన రిషి సునాక్- కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చివరికి లిజ్ ట్రస్‌నే విజయం వరించింది. రిషిపై ఏకంగా 21 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన లిజ్ బ్రిటన్ నూతన ప్రధానిగా పగ్గాలు సాధించేందుకు సిద్ధమయ్యారు. 2015 ఎన్నికల తర్వాత లిజ్ ట్రస్ కన్వర్వేటివ్ పార్టీ నుంచి ఆమె నాలుగో ప్రధాని కావడం గమనార్హం.
కొత్త ప్రధానిగా లిజ్ ముందు బోల్డన్ని సవాళ్లు ఉన్నాయి. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌ను ఇప్పుడు ద్రవ్యోల్బణం హడలెత్తిస్తోంది. జులైలో ఇది ఏకంగా 10.1 శాతాన్ని తాకింది. ఇప్పుడీ సంక్షోభం నుంచి దేశాన్ని ట్రస్ ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది ఆసక్తికరమే. కాగా, బ్రిటన్‌కు లిజ్ మూడో మహిళా ప్రధాని. ఆమె కంటే ముందు మార్గరెట్ థాచర్, థెరెస్సా మే ప్రధానులుగా పనిచేశారు. కాగా, మాజీ ఆర్థిక మంత్రి అయిన రిషి సునాక్ తొలుత బాగానే పోటీ ఇచ్చారు. లిజ్‌ను వెనక్కి నెట్టేసి ఒకానొక దశలో ప్రధాని కావడం ఖాయమన్న సంకేతాలు పంపారు. అయితే, చాలామంది లిజ్ ట్రస్‌కే మద్దతు ఇచ్చారు. దీనికితోడు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా రిషి ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లిజ్ విజయావకాశాలు మెరుగుపడ్డాయి.
Updated Date - 2022-09-05T23:02:27+05:30 IST