ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోకేబాజ్.. సిగ్గులేదు.. పార్లమెంటులో ఇక పదాలు వాడకూడదు

ABN, First Publish Date - 2022-07-14T20:50:32+05:30

పార్లమెంటులో ప్రజోపయోగ చర్చల కంటే ఒకరినొకరు విమర్శించుకోవడానికే ప్రజాప్రతినిధులు పోటీపడుతుంటారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రజోపయోగ చర్చల కంటే ఒకరినొకరు విమర్శించుకోవడానికే ప్రజాప్రతినిధులు పోటీపడుతుంటారు. ఈ క్రమంలో హద్దు మీరి, హోదా మరిచి ఒకరిపై ఒకరు దూషణకు దిగుతుంటారు. కొన్నిసార్లు ఇది మరింత శ్రుతిమించి తీవ్రస్థాయిలో తిట్టుకుంటూ ఉంటారు.


ఇకపై అలా ఇష్టానుసారం తిట్టుకోవడం కుదరదు. పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు ఒకరినొకరు తిట్టుకునేందుకు ఇప్పటి వరకు ఉపయోగించిన కొన్ని పదాలను ప్రభుత్వం నిషేధించింది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలు కొన్ని పదాలు వాడకూడదని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక బుక్‌లెట్‌ను విడుదల చేసింది. 


దాని ప్రకారం.. ‘Bloodshed, 'bloody', 'betrayed', 'ashamed', 'abused', 'cheated, 'chamcha', 'chamchagiri', 'chelas', 'childishness', 'corrupt', 'coward', 'criminal' and 'crocodile tears', 'disgrace', 'donkey', 'drama', 'eyewash', 'fudge', 'hooliganism', 'hypocrisy', 'incompetent', 'mislead', 'lie', 'untrue', 'anarchist', 'gaddar', 'girgit', 'goons', 'ghadiyali ansu', 'apmaan', 'asatya', 'ahankaar', 'corrupt' వంటి ఇంగ్లిష్ పదాలతోపాటు చంచా, చంచాగిరి, అసత్య్, అహంకార్, గూన్స్, అప్‌మాన్, తానాషా, తానాషాహి, జైచంద్, వినాష్ పురుష్, ఖలిస్థానీ, ఖూన్ ‌సే ఖేటి, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని వంటి హిందీ పదాలు కూడా ఉన్నాయి.  చట్ట సభ్యులు కనుక దీనిని ఉల్లంఘించి ఆ పదాలను ఉపయోగిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అధికారం లోక్‌సభ, రాజ్యసభ అధిపతులకు ఉంటుందని లోక్‌సభ సెక్రటేరియట్ పేర్కొంది.

Updated Date - 2022-07-14T20:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising