ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asiatic Lion: మనిషిని వేటాడి...ట్రాంక్వలైజర్లతో పట్టుబడింది

ABN, First Publish Date - 2022-07-24T20:26:56+05:30

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కార్మికుడిని బలంగా పంజాతో కొట్టి చంపి అక్కడ్నించి ఈడ్చుకుంటూ వెళ్లిన ఓ ఆసియా సింహాన్ని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్రేలి: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కార్మికుడిని బలంగా పంజాతో కొట్టి చంపి అక్కడ్నించి ఈడ్చుకుంటూ వెళ్లిన ఓ ఆసియా సింహాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకుని రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. గుజరాత్‌లోని తులసిశ్యామ్ రేంజ్ ఫారెస్ట్ ఏరియాలోని నానిధరి గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు ఆదివారంనాడు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బైదేశ్ పయర్ పనులు ముగించుకుని గ్రామానికి తిరిగి వెళ్తుండగా ఎనిమిదేళ్ల ఆసియా సింహం దాడి చేసింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన అతన్ని కొంతదూరం ఈడ్చుకుని తీసుకెళ్లింది. స్థానికులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడంతో హుటాహుటిన అధికారుల బృందం అక్కడకు చేరుకుంది. బైదేశ్ మృతదేహాన్ని స్వాధీనం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింహం జాడ పసిగట్టి ట్రాంక్వలైజర్ గన్‌తో పడగొట్టి ధరి రెస్క్యూ సెంటర్‌కు తరలించారు.


గుజరాత్‌లోని గిర్ అడవులతో సహా సౌరాష్ట్ర రీజియన్‌లో ఆసియా సింహాలు కనిపిస్తుంటాయి. 2020 జూన్‌‌ లెక్కల ప్రకారం గిర్ ఫారెస్ట్ ప్రాంతంలో 674 సింహాలు ఉన్నాయి. 2015లో 523 సింహాలు ఉండగా, ఇటీవల కాలంలో వాటి సంతతి పెరిగింది.

Updated Date - 2022-07-24T20:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising