Bihar : అప్పు తీర్చలేదని మహిళ అవయవాలను నరికేసిన దుర్మార్గులు
ABN, First Publish Date - 2022-12-07T18:27:08+05:30
ప్రాణానికి విలువ ఇవ్వని దుర్మార్గులు రెచ్చిపోయారు. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదనే ఉక్రోషంతో ఓ మహిళ
భాగల్పూర్ (బిహార్) : ప్రాణానికి విలువ ఇవ్వని దుర్మార్గులు రెచ్చిపోయారు. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదనే ఉక్రోషంతో ఓ మహిళ అవయవాలను నరికేశారు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిర్‌పైంటి పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబరు 3న ఈ దారుణం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నీలం దేవి అనే మహిళ తన కుమార్తె వివాహం కోసం కొంత సొమ్మును షకీల్ మియాన్ నుంచి అప్పుగా తీసుకున్నారు. ఆమె ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో కోపోద్రిక్తుడైన షకీల్ తన సహచరుడు జుడిన్ మియాన్‌తో కలిసి నీలం దేవిపై దాడి చేశాడు. వీరిద్దరూ కలిసి ఆమె అవయవాలను నరికేశారు. అనంతరం ఆమె ప్రాణాలు కోల్పోయారు.
జుడిన్‌ను అరెస్టు చేశామని, షకీల్‌ను కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించిందని భాగల్పూర్ ఎస్‌పీ చెప్పారు.
Updated Date - 2022-12-07T18:27:14+05:30 IST