ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాన్ కీ బాత్ లాంటిది: బడ్జెట్‌పై జార్ఖండ్ సీఎం విమర్శ

ABN, First Publish Date - 2022-02-02T02:01:29+05:30

ఈ బడ్జెట్ మరో మన్ కీ బాత్. మాటలే కానీ చేతలేమీ ఉండవు. ఇప్పటికే దేశంలోని ఆస్తులను కంపెనీలను వరుస పెట్టి అమ్ముతున్నారు. అలా బీజేపీ కూడా 5,000 కోట్ల రూపాయల కంపెనీగా అవతరించింది. కానీ దేశం కోసం బీజేపీ చేసిందేమీ లేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్‌ ‘మన్ కీ బాత్’ లాంటిదని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విమర్శించారు. దేశంలో ఉన్న కంపెనీలను, ఆస్తులను అమ్మేస్తూ బీజేపీ కూడా ఒక కంపెనీలాగ తయారైందని ఆయన దుయ్యబట్టారు. దేశంలోని 70 శాతం ప్రజలు పేద, మధ్య తరగతికి చెందిన వారని, వారి గురించి ప్రభుత్వం అసలు ఆలోచనే చేయలేదని అన్నారు.


మంగళవారం బడ్జెట్ అనంతరం జార్ఖండ్‌ రాజధాని రాంచీలో మీడియాతో హేమంత్ సోరెన్ మాట్లాడుతూ ‘‘ఈ బడ్జెట్ మరో మన్ కీ బాత్. మాటలే కానీ చేతలేమీ ఉండవు. ఇప్పటికే దేశంలోని ఆస్తులను కంపెనీలను వరుస పెట్టి అమ్ముతున్నారు. అలా బీజేపీ కూడా 5,000 కోట్ల రూపాయల కంపెనీగా అవతరించింది. కానీ దేశం కోసం బీజేపీ చేసిందేమీ లేదు. ఈ దేశంలో 70 శాతం ప్రజలు పేద, మధ్య తరగతికి చెందినవారు. ఈ బడ్జెట్‌లో వారి ప్రస్తావనే లేదు’’ అని అన్నారు.

Updated Date - 2022-02-02T02:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising