ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lifts, Escalators: దక్షిణ రైల్వే పరిధిలో 118 లిఫ్ట్‌లు, 134 ఎస్కలేటర్లు

ABN, First Publish Date - 2022-12-13T10:35:49+05:30

ప్రయాణికుల సౌకర్యార్ధం దక్షిణ రైల్వే పరిధిలోని పలు రైల్వేస్టేషన్లలో 118 లిఫ్ట్‌లు, 134 ఎస్కలేటర్లు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు దక్షిణ రై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 12: ప్రయాణికుల సౌకర్యార్ధం దక్షిణ రైల్వే పరిధిలోని పలు రైల్వేస్టేషన్లలో 118 లిఫ్ట్‌లు, 134 ఎస్కలేటర్లు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే(Southern Railway) విడుదల చేసిన ప్రకటనలో నవంబరు లెక్కల ప్రకారం, దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై డివిజన్‌ పరిధిలోని 24 రైల్వేస్టేషన్లలో 50 లిఫ్ట్‌లు, పాలక్కాడు డివిజన్‌లో 11 స్టేషన్లలో 24, తిరువనంతపురం డివిజన్‌లో 11 స్టేషన్లలో 21 లిఫ్ట్‌లు, సేలం డివిజన్‌లో 5 స్టేషన్లలో 11 లిఫ్ట్‌లు, మదురై డివిజన్‌లో 3 స్టేషన్లలో 9 లిఫ్ట్‌లు పనిచేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం దక్షిణ రైల్వే పరిధిలోని తమిళనాడులో 75 లిఫ్ట్‌లు, కేరళ రాష్ట్రంలో 39, పాండిచ్చేరి రాష్ట్రంలో 4 లిఫ్ట్‌లున్నాయని తెలిపింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం నవంబరు వరకు చెన్నై ఎగ్మూర్‌(Chennai Egmoor), బేసిన్‌ బ్రిడ్జి, తిరుచ్చిలో తలా మూడు, కాయన్‌కుళంలో ఒక లిఫ్ట్‌ ఏర్పాటుచేశామని, ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగా మరో 31 లిఫ్ట్‌లు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.50 లక్షలు కేటాయించామని, 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 122 లిఫ్ట్‌లు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపింది.

ఎస్కలేటర్లు... : దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై డివిజన్‌ పరిధిలోని 21 రైల్వేస్టేషన్లలో 62 ఎస్కలేటర్లు, తిరువనంతపురం డివిజన్‌లో 12 స్టేషన్లలో 30 ఎస్కలేటర్లు, పాలక్కాడు డివిజన్‌లో 6 స్టేషన్లలో 13, సేలం డివిజన్‌లో 4 స్టేషన్లలో 12, తిరుచ్చి డివిజన్‌లో 2 స్టేషన్లలో 9, మదురై డివిజన్‌లో 2 స్టేషన్లలో 8 ఎస్కలేటర్లు ఏర్పాటుచేశామన్నారు. ఆ విధంగా, తమిళనాడులో 93 ఎస్కలేటర్లు, కేరళలో 39, కర్ణాటక రాష్ట్రంలో 2 ఎస్కలేటర్లున్నాయని, ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.1.1 కోట్ల వ్యయంతో మూడు ఎస్కలేటర్లు ఏర్పాటుచేయనున్నామని తెలిపింది. ప్రయాణికుల రద్దీ పరిశీలించి అవసరమైన రైల్వేస్టేషన్‌లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటుచేయనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-12-13T10:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising