ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదాములో చిరుత..

ABN, First Publish Date - 2022-01-22T14:56:12+05:30

కోయంబత్తూరు సమీపం సుగుణా పురం వద్ద ఓ గోదాములో సంచరిస్తున్న ఆడ చిరుతపులిని పట్టుకు నేందుకు అటవీ శాఖ సిబ్బంది ఐదురోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయిదురోజులుగా ఆ చిరుతపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కోయంబత్తూరు సమీపం సుగుణా పురం వద్ద ఓ గోదాములో సంచరిస్తున్న ఆడ చిరుతపులిని పట్టుకు నేందుకు అటవీ శాఖ సిబ్బంది ఐదురోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయిదురోజులుగా ఆ చిరుతపులి ఆ గోదాములోనే తిష్టవేసింది. ఆ గోదాముకు ఇరువైపులా ఉన్న ప్రవేశ ద్వారాల వద్ద అటవీ శాఖ సిబ్బంది బోన్లు ఏర్పాటు చేశారు. గోదాము చుట్టూ పొడవైన ప్లాస్టిక్‌ వలను కూడా కట్టారు. ఇన్ని ఏర్పాట్లు చేసినా ఆ పులి గోదాము నుంచి బయటకు వచ్చి బోనులో చిక్కటం లేదు. గత మూడు నెలలుగా ఆ పులి సుగుణాపురం పరిసర ప్రాంతాల్లో సంచరించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. చివరకు ఆ పులి గత సోమవారం ఉదయం అక్కడి గోదాములో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఐదు రోజులుగా ఆ పులిని బోనులో బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గోదాము చుట్టూ సీసీ  కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో ఆ చిరుతపులి గోదాము నుంచి ప్రవేశ ద్వారం వద్దకు వచ్చి బోన్‌ చూసి వెనక్కి వెళుతుండం కనిపించింది. ఆ గోదాములో సరకులు నిల్వలు అధి కంగా ఉండటంతో ఆ పులి ఎక్కడ దాగి ఉందో తెలియక అటవీ శాఖ సిబ్బంది అవస్థలుపడుతున్నారు. చివరకు ఆ పులిని మత్తుమందు ఇంజెక్షన్లు వేసి పట్టుకోవాలని భావిస్తున్నారు.

Updated Date - 2022-01-22T14:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising