ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల వాష్‌రూమ్‌లో చిక్కుకున్న చిరుతపులి.. కాపాడిన అటవీ సిబ్బంది

ABN, First Publish Date - 2022-06-29T22:16:44+05:30

పాఠశాల గేటు దూకి లోపలకు ప్రవేశించిన ఓ చిరుతపులి వాష్‌రూమ్‌లో చిక్కుకుపోయింది. వాచ్‌మన్ ఇచ్చిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పాఠశాల గేటు దూకి లోపలకు ప్రవేశించిన ఓ చిరుతపులి వాష్‌రూమ్‌లో చిక్కుకుపోయింది. వాచ్‌మన్ ఇచ్చిన సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది రంగలోకి దిగి సుమారు మూడు గంటల సేపు శ్రమించి చిరుతను పట్టుకున్నారు. సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. గురుగావ్ ఈస్ట్‌లోని బింబిసార్ నగర్‌లో ఉన్న బీఎంసీ స్కూలులో బుధవారంనాడు ఈ సంఘటన చోటుచేసుకుంది.


పాఠశాల సమీపంలో అడవులను తలపించే దట్టమైన వృక్షాలు ఉన్నాయని, మంగళవారం రాత్రి స్కూలు క్యాంపస్‌లోకి వచ్చిన చిరుతపులి వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి అక్కడే చిక్కుకుపోయిందని అటవీ శాఖ అధికారి గిరిరాజ దేశాయ్ తెలిపారు. వాచ్‌మన్ ఇచ్చిన సమాచారంతో ముంబై అటవీ శాఖ సిబ్బంది, ఎన్‌జీఎన్‌పీ రెస్క్యూ టీమ్, వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిందన్నారు. చిరుతను సురక్షితంగా కాపాండేందుకు మూడు గంటలు పట్టిందని చెప్పారు. చిరుతపై ట్రాంక్వలైజర్‌ ఉపయోగించి, అది మత్తులోకి రాగానే సురక్షితంగా బయటకు తెచ్చి, అటవీ శాఖ వాహనంలో అక్కడి నుంచి తరలించినట్టు వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఫేస్‌బుక్ పేజ్‌లో షేర్ చేసింది.

Updated Date - 2022-06-29T22:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising