ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Leopard: హౌసింగ్ కాంప్లెక్సులోకి ప్రవేశించిన చిరుతపులి...ముగ్గురికి గాయాలు

ABN, First Publish Date - 2022-11-25T12:54:09+05:30

అడవి నుంచి ఓ చిరుతపులి హౌసింగ్ కాంప్లెక్సులోకి ప్రవేశించిన ఘటన మహారాష్ట్రలోని....

Leopard Enters Building
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి: అడవి నుంచి ఓ చిరుతపులి హౌసింగ్ కాంప్లెక్సులోకి ప్రవేశించిన ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ నగరంలో వెలుగుచూసింది.కళ్యాణ్ (తూర్పు)లోని చిచ్‌పాడ వద్ద ఉన్న అనుగ్రహ టవర్ నివాస భవనంలోకి ప్రవేశించిన పెద్ద మగ చిరుతపులి ప్రవేశించింది. ఈ చిరుత దాడిలో అటవీ అధికారితో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. చిరుత దాడిలో గాయపడిన వారిలో మనోహర్ గైక్వాడ్, రాజీవ్ పాండేలు శ్రీరామ్ అనుగ్రహ హౌసింగ్ సొసైటీ భవనంలో నివాసం ఉంటున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న ఫారెస్ట్ ఆఫీసర్ దినేష్ గుప్తాపై చిరుత దాడి చేసింది.చిరుతపులి మొదట ఉదయం 8 గంటలకు కనిపించిందని, సొసైటీ ఆవరణలో మరియు చుట్టుపక్కల తిరుగుతూనే ఉందని స్థానికులు తెలిపారు.

కళ్యాణ్‌లోని నివాస పరిసరాల్లో చిరుతపులి కనిపించడం ఇదే తొలిసారి అని భవనం నివాసి కిరణ్ గుప్తా చెప్పారు.ఉదయం 10 గంటలకు అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని భవనం మొత్తాన్ని సీల్ చేశారు. లోపల ఉన్న నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, బయట ఉన్నవారిని ఇళ్లలోకి అనుమతించడం లేదని చెప్పారు. చిరుతకు ట్రాంక్విలైజర్ షాట్ ఇచ్చి పట్టుకున్నామని డిప్యూటీ కన్జర్వేటర్ (వన్యప్రాణి) సంతోష్ చెప్పారు.

Updated Date - 2022-11-25T12:56:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising