ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Udayanidhi: ఉదయనిధికి సచివాలయంలో ప్రత్యేక ఛాంబర్‌

ABN, First Publish Date - 2022-12-12T09:27:26+05:30

డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తనయుడు చేపాక్‌- ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడు ఉదయనిధికి మంత్రివర్గంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తనయుడు చేపాక్‌- ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడు ఉదయనిధికి మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ఆ దిశగా మంత్రి వర్గంలో మార్పులు చేయడానికి స్టాలిన్‌ కసరత్తు చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌ సహా మంత్రులంతా ఉదయనిధిని మంత్రివర్గంలో చేర్చుకోవాలంటూ స్టాలిన్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు స్టాలిన్‌ సిద్ధమైనట్లు తెలిసింది. ఆ మేరకు ఉదయనిధికి సచివాలయంలో ప్రత్యేక ఛాంబర్‌ ఏర్పాటు చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. సచివాలయ భవన సముదాయంలో వేర్వేరు ఛాంబర్లున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవిని చేపట్టనున్న ఉదయనిధి కోసం సచివాలయం పదో నెంబర్‌ ప్రవేశద్వారం సమీపంలో ఛాంబర్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇదే విధంగా రెండో అంతస్థులోని ఓ విశాలమైన గది కూడా ఉదయనిధి చాంబర్‌గా మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు. మంత్రి పదవిని స్వీకరించిన తర్వాత ఉదయనిధి ఈ రెండు ఛాంబర్లలో ఒకదానిని ఎంపిక చేసుకుని తన కార్యకలాపాలను నిర్వర్తిస్తారని సచివాలయ ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-12-12T09:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising