ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shashi Tharoor: పార్లమెంటు మెట్లు దిగుతూ జారిపడిన శశిథరూర్, కాలికి గాయం

ABN, First Publish Date - 2022-12-16T17:06:08+05:30

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ గాయపడ్డారు. గురువారంనాడు పార్లమెంటు మెట్లు దిగుతుండగా జారిపడ్డారు. దీంతో ఎడమకాలి మడమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ (Shashi Tharoor) గాయపడ్డారు. గురువారంనాడు పార్లమెంటు మెట్లు దిగుతుండగా జారిపడ్డారు. దీంతో ఎడమకాలి మడమ బెణికింది. ప్రస్తుతం వైద్యుల సలహాతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నానని, నడవలేని పరిస్థితిలో ఈరోజు పార్లమెంటుకు హాజరుకావడం లేదని, నియోకజకవర్గంలో వారాంతపు పర్యటన కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నానని శుక్రవారం ఒక ట్వీట్‌లో శశిథరూర్ తెలిపారు.

''కొంత అసౌకర్యానికి గురయ్యాను. పార్లమెంటులో మెట్లు దిగుతుండగా కాలు జారింది. ఎడమకాలి మడమ బెణికింది. కొద్దిసేపు పట్టించుకోనప్పటికీ నొప్పి తీవ్రం కావడంతో ఆసుపత్రికి వెళ్లాను. ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉన్నారు. నియోజకవర్గం కార్యక్రమాలు రద్దు చేసుకున్నాను" అని శశిథరూర్ ట్వీట్ చేశారు. కాలికి ప్లాస్టర్ వేసి ఉన్న ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. శశిథరూర్ ట్వీట్‌తో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు యూజర్లు స్పందించారు. మీ ఆరోగ్యం జాగ్రత్త సార్..ఈ వయసులో మీరు ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి..అని ఒక యూజర్ కామెంట్ చేశారు. త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నానంటూ మరో యూజర్ పేర్కొన్నారు. పార్లమెంటుకు మీరు హాజరుకాని లోటు పూడ్చలేనిదని, మిమ్మల్ని మిస్సవుతున్నామని మరొకరు కామెంట్ చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తీరికి సమయంలో మరో పుస్తకం రాయలని ఒక యూజర్ కోరారు.

Updated Date - 2022-12-16T17:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising