ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన లెఫ్ట్ పార్టీలు

ABN, First Publish Date - 2022-05-17T16:27:14+05:30

దేశంలో నానాటికీ పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త నిరసనకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. మే 25 నుంచి 31 వరకు ఈ నిరసన చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లన్నింటికీ ఈ విషయమై సమాచారం అందించాయి. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త నిరసనకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. మే 25 నుంచి 31 వరకు ఈ నిరసన చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లన్నింటికీ ఈ విషయమై సమాచారం అందించాయి. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. కాగా, పలు డిమాండ్ల జాబితాను కేంద్రం ముందుకి తీసుకువచ్చాయి. పెట్రోల్ ఉత్పత్తులపై పెరిగిన ధరలను తగ్గించడం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గోధుమ సరఫరాను పునరుద్దరించడం, నిత్యవసర వస్తువుల పంపిణీ ప్రజా పంపిణీని బలోపేతం చేయడం లాంటి డిమాండ్లు ఈ జాబితాలో ఉన్నాయి. "నిరంతరంగా పెరుగుతున్న ధరలు ప్రజలకు మోయలేని భారం అవుతోంది. ఎంతో మంది ఆకలితో బాధపడుతున్నారు. మరెందరో పేదరికంలోకి మళ్లుతున్నారు. దీనికితోడు నిరుద్యోగం సైతం తీవ్ర స్థాయిలో పెరగడం మరింత తీవ్ర సమస్యగా మారింది. ఒకవైపు నిరుద్యోగం, మరొకవైపు ధరల పెరుగుదల.. ప్రజల కష్టాలను నానాటికీ తీవ్రతరం చేస్తున్నాయి" అని వామపక్షాలు పేర్కొన్నాయి.

Updated Date - 2022-05-17T16:27:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising