ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Snakes: షిండే వర్గంపై కస్సుమన్న సంజయ్ రౌత్

ABN, First Publish Date - 2022-07-19T20:51:44+05:30

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని సేన తిరుగుబాటు వర్గాన్ని ''పాములు'' అంటూ శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై:  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని సేన తిరుగుబాటు వర్గాన్ని ''పాములు'' (Snakes) అంటూ శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) సంబోధించారు. ''పాముల పడగలను మర్ధించడం మాకు తెలుసు. పాములున్నాయనే భయంతో అడవిని విడిచిపిట్టి వెళ్లేవాళ్లం కాదు. జై మహారాష్ట్ర!!'' అంటూ మంగళవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. శివసేన పార్టీకి చెందిన 18 మందిలో ఎంపీల్లో 12 మంది ఎంపీలు సీఎం షిండేతో టచ్‌లో ఉన్నారని, రెబల్ వర్గంలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ ఎంపీలంతా లోక్‌సభలో ప్రత్యేక బృందంగా వ్యవహరించనున్నారని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో సంజయ్ రౌత్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.


కాగా, దేశ రాజధాని ఢిల్లీకి సోమవారంనాడు వచ్చిన ఏక్‌నాథ్ షిండే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎంపీల చేరికకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై శివసేనకు సంబంధించిన ఇరు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారంనాడు విచారణ జరుపనుంది.

Updated Date - 2022-07-19T20:51:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising