ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mallikarjuna Kharge : దురాక్రమణపై చర్చించాల్సిందే

ABN, First Publish Date - 2022-12-15T03:21:06+05:30

చైనా దురాక్రమణపై పార్లమెంటులో చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్లమెంటులో ప్రతిపక్షాల పట్టు

ఉభయ సభల నుంచి వాకౌట్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 14: చైనా దురాక్రమణపై పార్లమెంటులో చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఉభయసభల నుంచి వాకౌట్‌ చేశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బుధవారం ఈ అంశాన్ని లేవనెత్తారు. చైనా దురాక్రమణపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రతిపక్షాలన్నీ ఈ అంశంపై చర్చ జరగాలని కోరుకుంటున్నాయని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనలో తవాంగ్‌ వద్ద ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలియజేయలేదన్నారు. అక్కడ చైనా కొన్ని వంతెనలు నిర్మించినట్టు తెలిసిందని చెప్పారు. అయితే, ప్రతిపక్ష పార్టీలేమీ దీనిపై నోటీసు ఇవ్వనందున చర్చకు అనుమతించబోనంటూ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ తోసిపుచ్చారు. అయినప్పటికీ ఖర్గే మాట్లాడుతూనే ఉండటంతో మైక్‌ ఆగిపోయింది. ఇది చాలా సున్నితమైన అంశం అయినందున రక్షణ మంత్రి ప్రకటనపై వివరణలు అనుమతించబోనని మంగళవారమే స్పష్టం చేశానని డిప్యూటీ చైర్మన్‌ గుర్తుచేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా కొద్దిసేపు నిల్చొని నినాదాలు చేశారు.

అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేశారు. వాకౌట్‌ చేసినవారిలో కాంగ్రెస్‌, వామపక్షాలు, టీఎంసీ, ఎన్సీపీ, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం, శివసేన ఎంపీలు ఉన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు ముగియగానే కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. టీఎంసీ సభ్యుడు సుదీప్‌ బంద్యోపాధ్యాయ మాట్లాడుతూ చైనా దురాక్రమణపై చర్చకు అనుమతించకపోతే వాకౌట్‌ చేస్తామని తెలిపారు. వీరి డిమాండ్‌ను తోసిపుచ్చిన స్పీకర్‌ ఓం బిర్లా దీనిపై బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో సోనియాగాంధీ సహా ఇరుపార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. కాగా, లోక్‌సభలో వివిధ అంశాలపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ అనేక ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వాకౌట్‌ చేశారు. అనంతరం 17 ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటు హౌస్‌ కాంప్లెక్స్‌లో సమావేశమై చైనా దురాక్రమణ విషయంలో ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది.

Updated Date - 2022-12-15T03:21:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising