ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో కొనసాగుతోన్న చివరి దశ పోలింగ్

ABN, First Publish Date - 2022-03-07T19:09:03+05:30

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో భాగంగా సోమవారం చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఇప్పటికే 6 దశల్లో 349 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. ఇక ఈరోజు కొనసాగుతున్న ఏడవ దశ (చివరి దశ) పోలింగ్‌లో 54 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో భాగంగా సోమవారం చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఇప్పటికే 6 దశల్లో 349 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. ఇక ఈరోజు కొనసాగుతున్న ఏడవ దశ (చివరి దశ) పోలింగ్‌లో 54 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాగా, మధ్యాహ్న సమయానికి 35 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. గడిచిన ఆరు దశల పోలింగ్‌లో చిన్నిపాటి చెదురు ముదురు సంఘటనలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈరోజు మధ్యాహ్నం వరకు పరిస్థితి బాగానే ఉందని, ఈ దశను సైతం ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.


ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా మూడు పార్టీల మధ్య కొనసాగుతోంది. అధికార పార్టీ భారతీయ జనతా పార్టీతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఒపీనియన్ పోల్స్‌ ప్రకారం భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నప్పటికీ.. ఎస్పీకి వస్తున్న ఆదరణ, అంతు పట్టని బీఎస్‌పీ ఎత్తుగడలు ఫలితాల్ని తారుమారు చేయొచ్చనే అనుమానాలు లేకపోలేదు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన యూపీ ఎన్నికల పోలింగ్, మార్చి 7తో ముగియనుంది. ఎన్నికల ఫలితాలు మార్చి 10న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.

Updated Date - 2022-03-07T19:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising