ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srilanka లో ఎమర్జెన్సీ.. తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని Ranil Wickremesinghe

ABN, First Publish Date - 2022-07-13T18:26:29+05:30

శ్రీలంకలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ప్రధాని రణిల్ విక్రమసింఘే బుధవారం ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో :  శ్రీలంక(Srilanka)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో అత్యవసర పరిస్థితి(Emergency)ని విధిస్తున్నట్టు ప్రధాని రణిల్ విక్రమసింఘే(Ranil Wickremesinghe) బుధవారం ప్రకటించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. తాత్కాలిక అధ్యక్షుడిగా(President)గా బాధ్యతలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారనే వార్తలు వెలువడగానే దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. పార్లమెంట్ ముట్టడికి జనాలు కదిలి వస్తుండడంతో ఎమర్జెన్సీ పరిస్థితిని విధిస్తున్నట్టు రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. కొలంబో సహా పశ్చిమ ప్రావిన్స్‌లో నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆందోళనలను అదుపులోకి తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ నెల 20న 


మాల్దీవులకు పారిపోయిన గొటబాయ రాజపక్స తక్షణమే రాజీనామా చేయాలని శ్రీలంకవాసులు డిమాండ్ చేస్తూ రోడ్లెక్కారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ప్రధాని కార్యాలయం ఆవరణ నుంచి వెళ్లిపోవాలని ఆందోళనకారులను భద్రతా బలగాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య తోపులాటలు జరిగాయి. సమూహాలను చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలను బలగాలు ప్రయోగించారు.


మాల్దీవులు పారిపోయిన గొటబాయ రాజపక్స

విమానంలో (Srilanka) అధ్యక్షుడు గొటబాయ రాజపక్స(Gotabaya Rajapaksa) దేశం విడిచి పారిపోయారు. మిలిటరీ విమానంలో మాల్దీవులు(Maldives) చేరుకున్నారు. బుధవారం ఉదయం మాలే(Male) నగరంలోని వెలానా ఎయిర్‌పోర్టులో ఆయన ప్రత్యక్షమయ్యారు. గొటబాయతోపాటు ఆయన సతీమణి, ఇద్దరు బాడీగార్డులు వెంటవున్నారు. మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధులు గొటబాయకు స్వాగతం పలికారు. మాలేలోని ఎయిర్‌పోర్టులో దిగాక పోలీస్ ఎస్కార్ట్‌తో రహస్య ప్రాంతానికి తరలించారు. మంగళవారం రాత్రి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అధ్యక్షుడు గొటబాయ ఇద్దరు బాడీ గార్డులతో మిలిటరీ విమానం బయలుదేరినట్టు ఆ దేశ రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2022-07-13T18:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising