ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Twelth Time: ఆర్జేడీ చీఫ్ పదవికి నామినేషన్ వేసిన లాలూ

ABN, First Publish Date - 2022-09-28T19:48:15+05:30

రాష్ట్రీయ జనతా దళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad yadav) పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad yadav) పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవికి బుధవారంనాడు నామినేషన్ (Nomination) వేశారు. పార్టీ  కార్యాలయంలో ఆయన నామినేషన్ వేశారు. ఆర్జేడీ వ్యవస్థాపకుడైన లాలూ వరుసగా 12వ సారి పార్టీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. ఆర్జేడీ పంచాయత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తోంది. షెడ్యూల్ ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్ 9న న్యూఢిల్లీలో జరగనుంది.


ఆర్జేడీని లాలూ ప్రాసాద్ యాదవ్ 1977లో స్థాపించారు. ఓబీసీలు, దళితులు, ముస్లింలు ఈ పార్టీకి సంప్రదాయ ఓటర్లుగా ఉన్నారు. అట్టడుగు స్థాయి ప్రజల కోసం పోరాడే పార్టీగా ఆర్జేడీకి పేరుంది. 2008లో ఆర్జేడీకి జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం బీహార్‌లో 165 మంది ఎమ్మెల్యేలతో మహాఘట్ బంధన్‌కు సారథ్యం వహిస్తున్న ఆర్జేడీ ఏకైక పెద్ద పార్టీగా ఉంది. పార్టీ యువనేత తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.


Updated Date - 2022-09-28T19:48:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising