ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్... బరిలో Lalu Prasad Yadav

ABN, First Publish Date - 2022-06-13T02:25:17+05:30

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో అనూహ్యంగా రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేత లాలూ ప్రసాద్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. పోటీలో తప్పనిసరిగా ఒక బిహారీ ఉండాలని లాలూ బలంగా కోరుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగానే నామినేషన్ వేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహత వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 15న లాలూ నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లేందుకు విమానం టిక్కెట్ కూడా రిజర్వ్ చేసుకున్నారు.


లాలూ ప్రసాద్ యాదవ్ 2017లోనూ నామినేషన్ వేశారు. అప్పటి బీహార్ గవర్నర్ రామ్‌వాథ్ కోవింద్‌కు, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌కు మధ్య ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ నెలకొన్నప్పటికీ లాలూ నామినేషన్ వేశారు. ''గత పర్యాయం నా నామినేషన్‌ను ఎన్‌డార్స్ చేసేందుకు తగిన సంఖ్యా బలం లేదు. అందువల్ల నా నామినేషన్ పత్రాలను తోసిపుచ్చారు. ఈసారి అలా కాదు. పక్కా ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాను'' అని లాలూ ప్రసాద్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఫోనులో తెలియజేశారు. పంచాయతీ ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నానని, ఒకవేళ అదృష్టం కలిసిరాకపోయినా గరిష్ట సంఖ్యలో ఎన్నికల్లో పోటీ చేసిన రికార్డు తన సొంతమవుతుందని లాలూ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2022-06-13T02:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising