ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lakhimpur కేసు నిందితుడు ఆశిష్ మిశ్రా విడుదల

ABN, First Publish Date - 2022-02-16T02:28:05+05:30

లఖింపూర్‌లో రైతుల్ని జీపుతో తొక్కించి చంపిన కేసులో ప్రధాన నిందుతుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా జైలు నుంచి విడుదలయ్యారు. లఖింపూర్ జైలులో కొంత కాలంగా శిక్ష ఎదుర్కొంటున్న ఆయనకు షరతుల మేరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: లఖింపూర్‌లో రైతుల్ని జీపుతో తొక్కించి చంపిన కేసులో ప్రధాన నిందుతుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా జైలు నుంచి విడుదలయ్యారు. లఖింపూర్ జైలులో కొంత కాలంగా శిక్ష ఎదుర్కొంటున్న ఆయనకు షరతుల మేరకు అలహాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం సాయంత్రం ఆయన జైలు గోడలు దాటారు. ఫిబ్రవరి 10న ఆశిష్‌కు బెయిల్ లభించినప్పటికీ, ఆయన విడుదల కాలేదు. లఖింపూర్ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీటులో ఆశిష్ మిశ్రాపై ఐపీసీ 147, 148, 149, 302,307,326,34,427. 120 బి కింద కేసు నమోదై ఉన్నాయి. ఆశిష్‌పై ఆయుధాల చట్టం సెక్షన్ కింద అభియోగం మోపారు. హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఆర్డర్‌లో సెక్షన్‌లు 302, 120 బి ప్రస్తావన లేదు. సెక్షన్ 302 హత్యకు సంబంధించినది అయితే, సెక్షన్ 120 బి నేరపూరిత కుట్రతో వ్యవహరిస్తుంది.బెయిల్ ఆర్డర్ నుంచి ఈ రెండు సెక్షన్లు తొలగించినందున, ఆశిష్ మిశ్రాను విడుదల చేయలేమని జైలు అధికారులు చెప్పారు. దీంతో బెయిల్ ఆర్డర్‌లో మిగిలిన రెండు సెక్షన్లను జోడించాలని ఆశిష్ మిశ్రా తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. గత సంవత్సరం అక్టోబరు 3న జరిగిన ఈ సంఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆశిష్‌ను గత సంవత్సరం అక్టోబరు 9న అరెస్టు చేశారు.

Updated Date - 2022-02-16T02:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising