ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానగరానికి మహిళా మేయర్‌

ABN, First Publish Date - 2022-03-05T13:45:56+05:30

దేశంలోని అతిపెద్ద మహా నగరాల్లో ఒక్కటైన రాష్ట్ర రాజధాని చెన్నైకి ప్రథమ పౌరురాలిగా దళిత మహిళ నిలిచారు. మూడున్నర దశాబ్దాల మహానగర చరిత్ర లో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డు సృష్టించారు. చెన్నై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - తొలి దళిత మహిళగా, అతిపిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కిన ప్రియ


చెన్నై: దేశంలోని అతిపెద్ద మహా నగరాల్లో ఒక్కటైన రాష్ట్ర రాజధాని చెన్నైకి ప్రథమ పౌరురాలిగా దళిత మహిళ నిలిచారు. మూడున్నర దశాబ్దాల మహానగర చరిత్రలో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డు సృష్టించారు. చెన్నై మేయర్‌ అయిన మూడో మహిళ అయినప్పటికీ, 28 ఏళ్ల ప్రాయంలో ఆ పీఠమెక్కిన తొలి మహిళ మాత్రం ఆమే. ఆమే చెన్నై 74వ వార్డు (తిరువికనగర్‌) కార్పొరేటర్‌ ఆర్‌.ప్రియ. ఎంకాం పట్టభద్రురాలైన ప్రియ గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) మేయర్‌గా ఎన్నికవ్వడం ద్వారా రాజకీయాలవైపు యువత దృష్టి సారించేందుకు కారణ మయ్యారు. ఆదిద్రావిడ వర్గానికి చెందిన ఆమె పెరంబూర్‌ నియో జకవర్గ పరిధిలోని మంగళపురం స్లమ్‌క్లియరెన్స్‌ బోర్డు క్వార్టర్స్‌లో నివశిస్తున్నారు. ఆమె భర్త కె.రాజా ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తు న్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ప్రియ తండ్రి పెరంబూర్‌ రాజన్‌ 30 ఏళ్లకు పైగా డీఎంకే సభ్యుడిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం పార్టీ పెరంబూర్‌ ప్రాంతీయ కార్యదర్శిగా వ్యవ హరిస్తున్నారు. ఆమె మామ దివంగత చెంగై శివం గతంలో మూడు సార్లు పెరంబూరు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఉత్తర చెన్నై ప్రాంతానికి చెందిన ప్రియ.. ఇప్పుడు 426 చ.కి.మీ విస్తీర్ణం కలిగి, 61 లక్షల కంటే ఎక్కువ మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీసీసీకి మేయర్‌ కావడం విశేషం. 350 ఏళ్ల చెన్నై కార్పొరేషన్‌ చరిత్రలో ఆమే అతి పిన్న వయస్కురాలు కూడా. చెన్నై కార్పొరేషన్‌ తొలి మహిళా చైర్మన్‌ తారా చెరియన్‌ (1957) కాగా, రెండో మేయర్‌గా కామాక్షి జయరామన్‌ (1971-72) ఆ బాధ్యతల్ని నిర్వర్తిం చారు. చెన్నైలో 200 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇందులో డీఎంకేకు సొంతంగా 153 మంది వున్నారు. వీరందరినీ కాదని మేయర్‌ పదవి ప్రియను వరించడం మరో విశేషం. 

Updated Date - 2022-03-05T13:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising