ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lady Commandos: సీఎం స్టాలిన్‌కు లేడీ కమాండోల భద్రత

ABN, First Publish Date - 2022-12-13T07:25:54+05:30

ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)కు పోలీసు భద్రత పెంచారు. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా కమాండో బల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై), డిసెంబరు 12: ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)కు పోలీసు భద్రత పెంచారు. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా కమాండో బలగాలను సీఎం స్టాలిన్‌ భద్రతా విభాగంలో తాజాగా చేర్చారు. కమాండో విభాగం ఎస్‌ఐ ధనుస్‌ కన్నగి నేతృత్వంలో హెడ్‌ కానిస్టేబుల్‌ దిల్షా బేగం, కానిస్టేబుళ్లు ఆర్‌.విద్య, జె.సుమతి, కాళీశ్వరి, పవిత్ర, మోనీషా, రమ్య తమ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రప్రభుత్వం మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖలో మహిళా కమాండో విభాగాన్ని పరిచయం చేసింది. పోలీసు శాఖలోని 80 మంది మహిళలు కమాండో శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పురుషులకు ధీటుగా నిర్వహించిన వివిధ రకాల పరీక్షల్లో నెగ్గారు. ఈ మహిళా కమాండోలు సీఎం పర్యటన వివరాలు గుప్తంగా ఉంచాలి. తమ కుటుంబసభ్యులకు కూడా వీరు పాల్గొనే కార్యక్రమాల వివరాలు తెలియజేయరాదని ప్రమాణస్వీకారం చేశారు.

Updated Date - 2022-12-13T07:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising